ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం మంచి రసవత్తకరంగా ముందుకు సాగుతుంది. ఒకరి పై ఒకరు విమర్శలు , ప్రతి విమర్శలతో ఎన్నికల వేడి పుట్టిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ప్రధానమైన సమస్య ఇసుక .. దీనిపై ప్రతిపక్షాలు నానా రచ్చ చేస్తున్నాయి. నదుల్లో నీరు ఫుల్ గా ఉంది .కొన్ని రోజులు ఓపిక పడితే ఇసుక కావాల్సినంత దొరుకుతుంది అని ప్రభుత్వం చెప్తున్నా కూడా ప్రభుత్వం పై రెచ్చిపోతున్నారు.
ఈ వ్యవహారం ఇలా కొనసాగుతున్న సమయంలోనే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశి టీడీపీ కి రాజీనామా చేయడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పార్టీకి , తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తునట్టు .. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి వల్లభనేని వంశీ వాట్సాప్ లేఖ లో తెలిపాడు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే .. సీఎం జగన్ అసెంబ్లీ లో మాట్లాడుతూ .. మేము మీలా వలసల రాజకీయం ప్రోత్సహించాం. ఎవరైనా ఇతర పార్టీ నేతలు మా పార్టీలో చేరాలి అంటే ఆ పార్టీ ద్వారా వచ్చిన పదవికి కచ్చితంగా రాజీనామా చేయాల్సిందే అని తెలిపాడు. ఇందులో భాగంగానే ..వంశీ రాజీనామా లెటర్ ని టీడీపీ అధినేత చంద్రబాబుకి పంపారు. దీనితో అధినేతగా చంద్రబాబే ..వంశీ రాజీనామా లేఖని స్పీకర్ కి పంపించాల్సి ఉంటుంది. ఈ రకంగా చేస్తే . రాజకీయాలపై వైసీపీ చిత్త శుద్ధి ఏంటో చెప్పాలని వైసీపీ నేతలు ఆలోచిస్తున్నారు.
ఇక వంశీ రాజీనామా వ్యవహారం ఇంకా ఎటూ తేలకమునుపే ..టీడీపీ నుండి మరో ముగ్గురు వైసీపీ లోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది.ఇందులో ఉత్తరాంధ్రకు చెందిన మాజీ మంత్రి ఒకరు, కోస్తాలోని ఇరువురు ఎమ్మెల్యేలతో అధికార వైసీపీ నేతలు టచ్ లో ఉన్నట్లు చెబుతున్నారు.ఈ ముగ్గురు ఎమ్మెల్యేలతోపాటు వంశీ, మరో ఇరువురిని తెలుగుదేశం పార్టీ నుంచి రాజీనామా చేయిస్తే చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా కూడా పోతుందనేది వైసీపీ వ్యూహంగా తెలుస్తోంది. కానీ, వారు జగన్ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నట్టు తెలుస్తుంది. మరోవైపు టీడీపీ కూడా ఎవరు పార్టీలో నుండి వెళ్లిపోకుండా తగిన చర్యలు తీసుకుంటుంది. కాకపోతే రాజీనామా చేసి ఎన్నికలకి మళ్ళీ సిద్ధం కావాలని వైసీపీ నేతలు చెప్తుండటంతో ..ఆ ముగ్గురు ఎమ్మెల్యే లు కొంచెం ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది.