కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్లే ఆ ఐదుగురు ఎవరు?

Update: 2022-11-26 11:30 GMT
తెలంగాణలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతోంది. నిన్న మర్రి శశిధర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బీజేపేలో చేరగా.. రాష్ట్రానికి చెందిన మరో ఐదుగురు కీలక నేతలు ఆ పార్టీతో టచ్ లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో ఆ ఐదుగురు ఎవరనేది ఆసక్తిగా మారింది.

రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాక సీనియర్లకు ఆయనకు పడడం లేదు. దీంతో బహిరంగంగానే రేవంత్ పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో కొంతమంది పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.

ప్రస్తుతం కాంగ్రెస్ లో రేవంత్ వర్సెస్ సీనియర్లు అన్నట్టుగా పరిస్థితి ఉంది. ఇక రేవంత్ కు టీపీసీసీ పదవి ఇవ్వడం సీనియర్లకు నచ్చలేదు. ఈ క్రమంలోనే వారు ప్రత్యామ్మాయ పార్టీని చూసుకునే పనిలో పడ్డట్టు తెలుస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉండి, రాష్ట్రంలో పుంజుకుంటున్న బీజేపీ వైపే అసంతృప్తి నేతలు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఐదుగురు నేతలు ఇప్పటికే బీజేపీతో మంతనాలు జరిపినట్లు విశ్వసనీయ సమాచారం.

ఆ ఐదుగురు ఎవరనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ వారు పార్టీని వీడితే మాత్రం అది తెలంగాణ కాంగ్రెస్ కు కోలుకోలేని దెబ్బ అని చెప్పాలి. గతంలో చేరికలపై టీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేసిన బీజేపీ ఇప్పుడు తన వ్యూహాన్ని మార్చింది. దానికి కారణం టీఆర్ఎస్ నేతలను తమ పార్టీలో చేర్చుకుంటే వారిపై వ్యతిరేకత ఉంటుందని.. అది తమ కొంపకే చేటు తెస్తుందని నేతలు భావిస్తున్నారు. కానీ కాంగ్రెస్ నేతలను చేర్చుకుంటే సానుకూల పవనాలు వస్తాయనే ఆలోచనలో ఉన్నారు.

అందుకే బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా ఇప్పుడు టీ కాంగ్రెస్ నేతలపై కాషాయ పార్టీ ఫోకస్ పెట్టింది. మరి రానున్న రోజుల్లో బీజేపీలో చేరే నాయకులు ఎవరన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News