పట్టాభిపై దాడి చేసింది ఎవరు? తెరపైకి ఆదిత్య పేరు

Update: 2021-02-13 08:30 GMT
తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభిపై దాడి ఘటన రాజకీయ కలకలానికి తెర తీసింది. విపక్షంపై అధికారపక్షం అదే పనిగా దాడులకు పాల్పడుతుందన్న విమర్శలు అంతకంతకూ ఎక్కువ అవుతున్న వేళ.. పట్టాభిపై జరిగిన దాడిని పలువురు తప్పు పట్టారు. అయితే..ఈ ఎపిసోడ్ లో చంద్రబాబు తీరు సైతం విమర్శలకు తావిచ్చింది. దాడి జరిగినప్పుడు.. దానికి సంబంధించిన అంశాలపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని ఎవరూ తప్పు పట్టరు. కానీ.. ఆ పేరుతో రాజకీయ లబ్థి పొందాలని భావించటం తప్పే అవుతుంది.

పట్టాభిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడినట్లు వార్తలు వచ్చినంతనే.. ఆయన్ను పరామర్శించేందుకు విపక్ష నేత చంద్రబాబు చేసిన హడావుడి.. దానికి తగ్గట్లే బాధితుడి స్థానంలో ఉన్న పట్టాభి సైతం సీన్ పండించేందుకు తెగ ప్రయత్నం చేశారు. దీనిపై పలు విమర్శలు వెల్లువెత్తాయి. అప్పటివరకు కూర్చొని జరిగిన దాడి గురించి చెప్పిన పట్టాభి.. ఎప్పుడైతే చంద్రబాబు వచ్చారో.. అప్పటివరకు కూర్చున్న ఆయన పడుకోవటం.. ఆయన్ను ఓదార్చే క్రమంలో టీడీపీ అధినేత వ్యవహారశైలిని తప్పు పట్టారు.

ఇదిలా ఉంటే.. పట్టాభి దాడిపై గుర్తు తెలియని దుండగుల దాడి విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ఏపీ పోలీసులు.. నిందితుల కోసం విపరీతంగా గాలిస్తున్నారు. తాజాగా ఈ అంశానికి సంబందించి ఆదిత్య అనే పేరు తెర మీదకు వచ్చింది. ఇంతకూ ఈ ఆదిత్య ఎవరు? అతని బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. తరచూ దూకుడు ప్రదర్శించే పట్టాభి లాంటి నేతకు రాజకీయ ప్రత్యర్థులు ఎక్కువన్న మాట వినిపిస్తుంది. ఈ క్రమంలోనే వేరే అంశాలకు సంబందించిన వివాదమే ఆయనపైదాడికి కారణమన్న వాదన వినిపిస్తోంది. అయితే.. పట్టాభిపై దాడి విషయంలో పోలీసుల విచారణ ఒక కొలిక్కి వస్తే తప్పించి.. దాడికి పాల్పడిన వారెవరన్నది తేలనుంది. అయితే.. ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నఆదిత్య ఎవరన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.


Tags:    

Similar News