ఇప్పటికే వూహాన్‌లో పుట్టిన కరోనా మహమ్మారితో ప్రపంచమంతా అల్లకల్లోలం అవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో అదే చైనాలో కొత్తగా జీ4 వైరస్ పుట్టుకు వచ్చింది. డ్రాగన్ దేశంలోని పందుల్లో ఈ వైరస్‌ను గుర్తించారు. కొత్త వైరస్‌గా చెబుతున్న జీ4 పైన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యుహెచ్ఓ) ఓ ప్రకటన చేసింది. ఈ వైరస్ కొత్తదేమీ కాదని స్పష్టం చేసింది.
చైనాలోని పందులలో గుర్తించిన ఈ వైరస్ G4 EA H1N1. ఈ కొత్త స్వైన్ ఫ్లూ వైరస్‌ను 2011 నుండి తమ సంస్థ గమనిస్తోందని తెలిపింది. 2011 నుండి 2018 మధ్య కాలంలో ఈ వైరస్‌పై ఉన్న సమాచార విశ్లేషణే తాజా అధ్యయనం అని పేర్కొంది. పందులను పెంచేవారు ఈ వైరస్ బారిన ఎక్కువగా పడినట్లు గుర్తించినట్లు కూడా డబ్ల్యుహెచ్ఓ తెలిపింది. ఈ మేరకు డబ్ల్యుహెచ్ఓ డైరెక్టర్ మైక్ రయన్ ప్రకటించారు.
ఇది కొత్త వైరస్ కాకపోయినప్పటికీ పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. 'ఇది కొత్త వైరస్ కాదని ప్రజలకు భరోసా ఇవ్వడం ఎంతో ముఖ్యం. అలాగే దీనిపై అప్రమత్తంగా ఉన్నాం' అని మైక్ రయన్ తెలిపారు. ఈ వైరస్ పట్ల ముందుముందు కూడా ఇలాగే అప్రమత్తంగా ఉంటామని తెలిపారు.
ఇటీవల ఈ కొత్త వైరస్ ప్రపంచాన్ని చుట్టేయవచ్చునని అమెరికాకు చెందిన ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ జర్నల్‌లో ప్రచురించారు. తాజా అధ్యయనం ఆధారంగా చైనాలో కొత్త వైరస్ వచ్చిందని వార్తలు రావడంతో డబ్ల్యుహెచ్‌వో స్పందించింది.