డబ్ల్యూహెచ్ ఓ కీలక ప్రకటన: కరోనా తగ్గిన వారికి మళ్లీ రాదని గ్యారంటీ ఇవ్వలేం!
ప్రస్తుతం కరోనా వైరస్ దావానంలా వ్యాప్తి చెందుతుండగా ఆ వైరస్ బారిన పడిన వారు కొద్ది సంఖ్యలో కోలుకుంటున్నారు. ఆ వైరస్ కేసులు పెరుగుతుండగా తగ్గుతున్న వారి సంఖ్య స్వల్పంగానే ఉంది. అయితే ఆ కోలుకున్న వారికి మళ్లీ కరోనా వైరస్ సోకుతుండడంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒకవైపు మొదటిసారి వచ్చిన వారినే నివారించడానికి అష్టకష్టాలు పడుతుంటే తగ్గిన వారికి మళ్లీ వైరస్ బారిన పడడం పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి.
అయితే కరోనా నుంచి కోలుకున్న వారికి మళ్లీ పాజిటివ్ రావడంపై వైద్యులు సమాధానం ఏమీ ఇవ్వలేకపోతున్నారు. ఇలాంటి సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ ఓ) స్పందించింది. దీనిపై ఓ క్లారిటీ ఇచ్చింది. యాంటీ బాడీస్ పరీక్షల్లో ఎక్కడ కూడా రోగ నిరోధక శక్తి కారణంగా కరోనా వైరస్ బారిన పడి కోలుకున్నట్లు ఆధారాలు లభించలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ సీనియర్ ఎపిడిమాలాజిస్ట్‌లు చెబుతున్నారు. ఒకసారి వైరస్ బారిన పడి కోలుకున్న వారు మళ్లీ వైరస్ బారిన పడరనే గ్యారంటీ లేదని స్పష్టం చేస్తున్నారు. అంటే కరోనా సోకి కోలుకున్న వారికి మళ్లీ ఆ వైరస్ పాజిటివ్ వచ్చే అవకాశం ఉందని చెప్పకనే చెప్పింది.
బ్రిటన్‌లో దాదాపు 35 లక్షల రక్త నమూనాల్లో యాంటీ బాడీస్ స్థాయిని పరీక్షించారు. వాటిలో కరోన బారిన పడి కోలుకున్న వారి రక్త నమూనాలను కూడా సేకరించగా కోలుకున్న వారిలో యాంటీ బాడీస్ ఎక్కువ ఉన్న పరిస్థితి కనిపించలేదని డబ్ల్యూహెచ్ఓ శనివారం జెనీవాలో ఏర్పాటుచేసిన సమావేశంలో వెల్లడించింది. యాంటీ బాడీస్ ఎక్కువ ఉంటే కచ్చితంగా కరోనా వైరస్ బారిన పడి కోలుకుంటారని కూడా చెప్పలేమని తెలిపింది. ఇదే విషయం పలు దేశాల నుంచి సేకరించిన రక్త నమూనాలు పరిశీలించగా తేలిందని వెల్లడించింది. ఈ క్రమంలోనే కరోనా బారిన పడి కోలుకున్నవారు మళ్లీ ఆ వైరస్ సోకుతుందనే విషయం చెప్పలేమని స్పష్టం చేసింది. దీనిపై మరిన్ని పరిశోధనలు చేస్తున్నట్లు డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. ఎందుకైనా మంచిది కరోనా నుంచి కోలుకున్న వారు జాగ్రత్తలు పాటిస్తే ఆ వైరస్ మళ్లీ సోకే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని సూచించింది.