తెలంగాణలో కమలం వికసించేందుకు కొత్త సారథిని వెతుక్కుంటోంది. తెలంగాణ బీజేపీకి కొత్త చీఫ్ రాబోతున్నట్టు స్పష్టమైన సంకేతం వచ్చేసింది. ఈ మేరకు సంప్రదింపులు మొదలయ్యాయి. డిసెంబర్ లోనే తెలంగాణకు బీజేపీ కొత్త అధ్యక్షుడిని నియమించేందుకు రంగం సిద్ధమైంది. అధ్యక్ష పదవి ఆశిస్తున్న నేతల నుంచి ఇప్పటికే బీజేపీ అధిష్టానం అభిప్రాయ సేకరణ ప్రారంభించింది.
హైదరాబాద్ లోని నాంపల్లి బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర పార్టీ ఇన్ చార్జిగా నియమితులైన కృష్ణదాస్, పార్టీ ముఖ్య నేతలను పిలిపించుకొని కొత్త అధ్యక్షుడు ఎవరైతే బాగుంటుందనే అభిప్రాయాన్ని సేకరించారు. ఆదివారం మొత్తం ఇదే పనిలో ఉన్నారట.. ఈ మేరకు బీజేపీ అధిష్టానానికి నివేదిక పంపించినట్టు తెలిసింది.
బీజేపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం అధ్యక్ష రేసులో మొత్తం 13మంది నేతలు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు ఢిల్లీలో అప్పుడే లాబీయింగ్ మొదలుపెట్టేశారట..
ఈ 13 మందిలో ప్రస్తుత అధ్యక్షుడు లక్ష్మణ్ కూడా ఉన్నట్టు తెలిసింది. తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని ఆయన అర్జీ పెట్టుకున్నాడట.. ఇక మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు సైతం పదవి ఆశిస్తున్నారు. ఈ సీనియర్ సిటిజన్లతోపాటు బీజేపీ అధిష్టానం మదిలో బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్ రావు ఉన్నారు. కానీ ఆయన రాష్ట్ర బాధ్యతలు చేపట్టడానికి ఆసక్తి చూపడం లేదు.
ఇక ప్రస్తుత బీజేపీ నేతల విషయానికి వస్తే కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ రేసులో ముందున్నారు. ఆర్ఎస్ఎస్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన ఆయన అధ్యక్ష పదవి కోసం తీవ్రంగా పోటీపడుతున్నారట.. ఇక ఈయనతోపాటు డీకే అరుణ, జితేందర్ రెడ్డి, రాంచంద్రరావులు పార్టీ చీఫ్ పదవి ఆశిస్తున్నారు. అయితే బయట పార్టీల నుంచి రావడం వీరికి మైనస్ గా మారిందంటున్నారు.
వీరే కాదు అధ్యక్ష రేసులో దరఖాస్తు చేసుకున్న వారిలో మాజీ ఎంపీ వివేక్, చింతల రాంచంద్రారెడ్డి, కృష్ణ సాగర్ రావు, యెండల లక్ష్మీనారాయణ, రఘునందన్ రావులు ఉన్నట్టు తెలిసింది.
ప్రధానంగా సీనియర్లకు ఇవ్వాలా? లేదా జూనియర్లకు ఇవ్వాలనే విషయంలో బీజేపీ మల్లగుల్లాలు పడుతోంది. ఇక సొంత పార్టీ నేతల వైఫల్యం దృష్ట్యా ఈసారి వలసవచ్చిన వారిని ట్రై చేద్దామనే ఆలోచనలో కూడా ఉన్నారట.. కానీ పాత నేతలు నొచ్చుకుంటారనే టాక్ కూడా వినిపిస్తోంది. ఈ వివాదాన్ని రాజేయవద్దని భావిస్తే మళ్లీ లక్ష్మణ్ ను కొనసాగించే అవకాశాలు లేకపోలేదు. ఇలా తెలంగాణ బీజేపీ రేసులో ఇప్పుడు 13 మంది నేతలు తెరపైకి వచ్చారు. వారిలో ఎవరిని అదృష్టం వరిస్తుందనేది అంతుచిక్కని వ్యవహారంగా మారింది.