న‌కిలీ టికెట్లు అమ్మితే ఎవ‌రిది బాధ్య‌త‌?

Update: 2022-05-05 03:28 GMT
థియేట‌ర్ల ముందు బ్లాక్ టికెటింగ్ అనేది స‌ర్వ‌సాధార‌ణంగా చూసేదే. కానీ ఇప్పుడు న‌కిలీ టిక్కెట్లు అమ్ముతూ మోసం చేస్తున్న ఘ‌ట‌న‌లు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. తాజాగా ఏలూరులోని ఓ థియేట‌ర్ వ‌ద్ద నకిలీ టికెట్లు కొనుక్కుని మోస‌పోయిన ఓ ఫ్యామిలీ ల‌బోదిబోమ‌న‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

తీరా సినిమా చూసేందుక‌ని కుటుంబంతో వెళితే.. అత‌డికి ప‌రాభ‌వం ఎదురైంది. తాను కొనుక్కున్న టికెట్ చూపించి స‌ద‌రు వ్య‌క్తిని బ‌య‌టికి పంపించేయ‌డంతో గ‌డ‌బిడ మొద‌లైంది.. అక్క‌డ థియేటర్  స్టాఫ్ తో వాగ్వాదం అవ్వ‌డం వ‌గైరా విష‌యాలు బ‌య‌ట‌ప‌డ్డాయి.

ఒక్కో షోకి 10 చొప్పున న‌కిలీ టిక్కెట్లు అమ్మేస్తూ 3వేలు ఆర్జిస్తున్నార‌ట‌. అంటే రోజుకు 12000 న‌కిలీ టికెట్ల‌తో జేబులో వేసుకుంటున్నారు. ఇదంతా థియేట‌ర్ య‌జ‌మానికి తెలిసే స‌న్నివేశం లేదు. అయితే న‌కిలీ టికెట్లు కొనుక్కున్న వాళ్ల‌కు ఏం చేయాలో పాలుపోని ప‌రిస్థితి.

అటు థియేట‌ర్ యాజ‌మాన్యం దీనిని ప‌ట్టించుకోదు. ఇటు ప్ర‌భుత్వాలు అధికారులు కూడా బాధ్య‌త వ‌హించ‌రు. కొనుక్కుని బుక్క‌యిన వారికి చెప్పుకోవాలంటే సిగ్గు చేటు. మ‌రి దీనికి బాధ్య‌త వ‌హించి అరిక‌ట్టేదెవ‌రో అర్థం కాని ప‌రిస్థితి ఉంది.

టికెట్ రేట్లు తగ్గించ‌డంలో చూపించిన చొర‌వ ప్ర‌భుత్వం ఇలాంటి వాటి విష‌యంలో చూప‌డం లేద‌న్న ఆవేద‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

టికెట్ ధ‌ర‌లు పెంచి అమ్మితే సినిమాలు ఆడ‌నివ్వ‌మ‌ని హుంక‌రించిన వాళ్లు ఇప్పుడు ప్ర‌జ‌లు మోస‌పోతుంటే చోద్యం చూస్తున్నారా? అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇలాంటి మోసాలు ఏలూరు నుంచి ఇత‌ర ప్రాంతాల‌కు విస్త‌రించే వీలుంది. న‌కిలీ టికెట్ సేల్ ని అరిక‌ట్టాల్సిన అవ‌స‌రం ప్ర‌భుత్వానికి అధికారుల‌కు ఉంద‌ని కూడా సూచిస్తున్నారు కొంద‌రు.
Tags:    

Similar News