తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆ మధ్య మూడు రోజుల కుప్పం టూర్ పెట్టుకున్నారు. కొత్త ఏడాది మొదట్లో చంద్రబాబు తన సొంత నియోజకవర్గానికి వెళ్తే పోలీసులు ఆయన ప్రచార రధాన్ని అడ్డుకున్నారు. పోలీస్ స్టేషన్ కి తరలించారు. బాబు టూర్ ని చేయకుండా అడ్డగించారు. దీంతో బాబు కుప్పం పర్యటన అంతా రచ్చ రచ్చ అయింది. అయితే దాన్ని తెలివిగా ఆయన క్యాష్ చేసుకున్నారు. కుప్పం వీధులలో నడుస్తూ ఇంటింటికీ తిరుగుతూ తనను వైసీపీ ప్రభుత్వం ఎలా అడ్డుకుందో కళ్లకు కట్టినట్లుగా జనాలకు వివరించే ప్రయత్నం చేశారు.
దాంతో బాబుకు ఎక్కడ లేని పొలిటికల్ మైలేజ్ వచ్చింది. వైసీపీ ప్లాన్ బూమరాంగ్ అయింది. జీవో నెంబర్ వన్ కాస్తా ఏమీ కాకుండా పోయింది. ఆ తరువాత బాబు టూర్లు అయితే లేవు. ఈ మధ్యలో లోకేష్ పాదయాత్ర స్టార్ట్ అయింది. ఆయన రెండు నియోజకవర్గాలు తిరిగారు. ఈ రోజుతో వంద కిలోమీటర్ల మైలు రాయిని దాటారు. స్టడీగా లోకేష్ పాదయాత్ర సాగుతోంది కానీ అనుకున్నంతగా మీడియా అటెన్షన్ కానీ ఫోకస్ కానీ రావడంలేదు.
దాంతో లోకేష్ పాదయాత్రను మొత్తం తెర వెనక నుంచి డైరెక్ట్ చేస్తూ ఎప్పటికపుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ కొత్త కొత్త సూచనలు చేస్తూ వస్తున్న చంద్రబాబు ఆ పనిలోనే బిజీగా ఉన్నారు అని అంటున్నారు. లోకేష్ పాదయాత్ర సాగుతోంది కానీ సంచలనాలు నమోదు కావడంలేదు. దానికి కారణం వైసీపీ కూడా లైట్ తీసుకుంటోంది. సోషల్ మీడియాలో లోకేష్ ని ఆయన స్పీచ్ ని ట్రోల్ చేయడం తప్ప వైసీపీ పెద్దగా పట్టించుకోవడంలేదు.
మరో వైపు లోకేష్ స్పీచులలో కూడా ఫైర్ పెద్దగా లేదు. రొటీన్ విమర్శలే ఉంటున్నాయి. ఆయన పాదయాత్ర తెలుగుదేశం వరకూ పరిమితం అవుతోంది కానీ జనాలకు అనుకున్నంతగా కనెక్ట్ కావడంలేదు. దాంతో చంద్రబాబు పాదయాత్ర జోరు పెంచాలన్న దాని మీదనే ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. ఈ లోగా ఏపీలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. అధికార పార్టీలో అసమ్మతి చిచ్చు రాజుకుంది. దాంతో మీడియా డైవర్షన్ కూడా వేరుగా ఉంది.
ఈ నేపధ్యంలో చంద్రబాబు తాను ఈ సమయంలో పార్టీ ఆఫీసుకే పరిమితం కావాల్సి వస్తోంది అని అంటున్నారు. చంద్రబాబు పార్టీ ఇంచార్జులతో మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నారు. మరో వైపు లోకేష్ పాదయాత్రకు జన స్పందన తో పాటు హైలెట్ చేయాల్సిన అంశాల మీద కూడా ఫోకస్ పెడుతున్నారు అని అంటున్నారు. బాబు కనుక ఇపుడు జిల్లాల టూర్లు పెట్టుకుంటే కచ్చితంగా ఆయన మీదకే మీడియా అటెన్షన్ పోతుంది.
అదే సమయంలో బాబు పవర్ ఫుల్ డైలాగులు ఎటూ వైసీపీ సర్కార్ మీద వాడుతారు. దానికి ప్రతిగా వైసీపీ నుంచి కూడా ఘాటు రియాక్షన్ ఉంటుంది. దాంతో అటూ ఇటూ మాటల యుద్ధం సాగుతూ లోకేష్ పాదయాత్ర మరుగున పడుతుంది అని అంటున్నారు. అందువల్లనే బాబు ఇప్పట్లో రోడ్డెక్కకూడదు అని డెసిషన్ తీసుకున్నారు అని అంటున్నారు. లోకేష్ పాదయాత్ర పట్టాలెక్కిన మీదట దానికి జనాల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చి నలుగురూ మాట్లాడుకునే పరిస్థితి వచ్చాక మాత్రం బాబు జిల్లాల టూర్లు స్టార్ట్ అవుతాయని అంటున్నారు.
ఈలోగా బాబు మీడియా మీటింగ్స్ తో పాటు పార్టీ మీటింగ్స్ కే పరిమితం అవుతారు అని అంటున్నారు. మొత్తానికి చూస్తే తన కొడుకుని భావి వారసుడిగా కాబోయే సీఎం గా చూసుకునేందుకు జనాల మన్నన పొందేందుకు చంద్రబాబు తానుగా మబ్బుల చాటుకు వెళ్తున్నారు అని అంటున్నారు. ఇలా చంద్రబాబు చేయడం వల్ల ఆయనకు లోకేష్ కి లాభమెంత ఉందో తెలియదు కానీ కీలకమైన ఎన్నికల ఏడాదిలో బాబు టూర్లు పెట్టుకోకుండా ఉంటే అది కచ్చితంగా పార్టీకి ఇబ్బందిగా మారుతుందని పార్టీలో కొందరి మాటగా ఉంది.
పూర్తిగా లోకేష్ మీదనే పార్టీని వదిలివేయలేమని, అదే టైం లో పార్టీకి ప్రస్తుతం జోష్ వస్తున్న వేళ బాబు జిల్లా టూర్లకు రెడీ అయితే కచ్చితంగా మైలేజ్ వస్తుందని అంటున్నారు. లోకేష్ పాదయాత్రతో ముడిపెట్టి బాబు బ్రేకులేసుకుంటే మాత్రం కీలకమైన వేళ తెలుగుదేశం మంచి ఛాన్స్ ని మిస్ చేసుకున్నట్లే అని అంటున్న వరూ ఉన్నారు. అయినా అపర చాణక్యుడు అయిన బాబుకు ఇవన్నీ తెలియకుండా ఉంటాయా అన్నది చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.