తమిళనాడు సీఎం కుర్చీ ఎవరిది? టౌమ్స్ నౌ తాజా సర్వే ఏం చెప్పింది?

Update: 2021-03-09 04:16 GMT
ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ఫలితాలు ఏ రీతిలో ఉండనున్నాయన్న విషయాన్ని వెల్లడించేందుకు పలు సంస్థలు సర్వేలు నిర్వహిస్తున్నాయి. తాజాగా ప్రముఖ మీడియా సంస్థగా పేరున్న టైమ్స్ నౌ సంస్థ సీ ఓటరుతో కలిసి సర్వే నిర్వహించారు. దీనికి సంబంధించిన వివరాల్ని తాజాగా విడుదల చేశారు. కరుణా నిధి.. జయలలిత లాంటి ఉద్దండ నేతలు లేకుండా తొలిసారి జరుగుతున్న ఎన్నికల్లో విజయం ఎవరిది? అన్నది ఆసక్తికరంగా మారింది.

డీఎంకే.. అన్నాడీఎంకేలతో పాటు విశ్వ నటుడు కమల్ హాసన్ సైతం అధికారం కోసం ప్రయత్నిస్తున్నారు. తాజాగా జరిపిన సర్వేలో.. ఈ సారి విజయం యూపీఏ కూటమిదేనని తేల్చారు. డీఎంకే.. కాంగ్రెస్ కలిపి  కూటమిగా ఉన్న యూపీఏ అధికారంలోకి రావటం ఖాయమని తేల్చారు. గత ఎన్నికలతో పోలిస్తే 60సీట్లను అదనంగా గెలుచుకునే డీఎంకే మొత్తం 158సీట్లతో అధికారంలోకి రావటం పక్కా అని తేల్చాయి.

అదే సమయంలో అధికార అన్నాడీఎంకేకు 65 స్థానాల్ని కోల్పోయే అవకాశం ఉందంటున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా కరుణానిధి కుమారుడు స్టాలిన్ ను చూడాలని తమిళ ప్రజలు కోరుకుంటున్నట్లుగా తేలింది. 38.4 శాతం మంది స్టాలిన్ సీఎం అయితే బాగుంటుందని చెబితే.. ప్రస్తుత సీఎం పళనిస్వామి మరోసారి ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని 31 శాతం మంది పేర్కొన్నట్లు వెల్లించారు. శశికళకు 3.9 శాతం మంది.. పన్నీరు సెల్వానికి 2.6 శాతం మంది మాత్రమే మద్దతు పలకటం గమనార్హం. కొత్తగా పార్టీ పెట్టిన కమల్ హాసన్ ను సీఎంగా చూడాలని 7.4 శాతం మంది మాత్రమే చెప్పినట్లుగా సదరు సర్వే పేర్కొంది. సో.. ఈసారి ఎన్నికలు స్టాలిన్ కు అనుకూలంగా తమిళ ప్రజలు తీర్పు ఇవ్వనున్నారన్న మాట.
Tags:    

Similar News