ఒక సమ్మె ముగింపుకు అర్థం ఏంటి? వాళ్ల హక్కులు నెరవేరితేనే విరమిస్తారు. కానీ 50 రోజులకు పైగా సాగిన తెలంగాణ ఆర్టీసీ సమ్మె ముగింపు అత్యంత దారుణంగా ముగిసింది. అతీగతీ లేకుండా నిస్సహాయంగా వైదొలగాల్సి వచ్చింది. కార్మికుల హక్కులు నెరవేరింది లేదు.. వారి డిమాండ్లు పరిష్కారం అయ్యింది లేదు. సర్కారు స్పందించకపోవడంతో దిక్కులేని పరిస్థితిలో సమ్మె విరమిస్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ సంఘాల కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ప్రకటించారు.
తెలంగాణ ఆర్టీసీ సమ్మె ఈ విషాద ముగింపునకు కారణం ఎవరనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. కేసీఆర్ సర్కారు ఆది నుంచి ఆర్టీసీ కార్మికుల సమ్మె చట్టవిరుద్ధమని.. కార్మికుల సంఘాల మాట విని మోసపోవద్దని రెండు సార్లు చేరేందుకు అవకాశం ఇచ్చింది.కానీ ఆర్టీసీ కార్మిక సంఘాలు మాత్రం మొండిపట్టుదలతో సమ్మెను విరమించనీయకుండా అడ్డుకున్నారు. కార్మికులను ప్రేరేపించారు.
చివరకు కేసీఆర్ ఏ మాట మీద అయితే ఉన్నారో అదే మాటతో సమ్మెపై పట్టువీడలేదు. కానీ ఆర్టీసీ కార్మిక సంఘాలు మాత్రం సమ్మెపై పట్టుసడలించి తాము విరమిస్తున్నట్టు ప్రకటించారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో ఇప్పుడు అందరి వేళ్లు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి వైపే చూపుతున్నాయి.
కార్మికుల్లో ఉక్రోషం ఉడుకుతోంది. ఎలాంటి హామీలు, డిమాండ్లు నెరవేరకుండా నిస్సహాయంగా సమ్మెను విరమిస్తున్నట్టు అశ్వత్థామరెడ్డి చేసిన ప్రకటనపై కార్మిక లోకం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రెండు నెలలుగా తమ జీవితాలతో ఆడుకొని ఇప్పుడు సమ్మె విరమించడానికి నువ్వు ఎవరు అంటూ కార్మికులు అశ్వత్థామరెడ్డిని ప్రశ్నిస్తున్నారు. కార్మిక సమ్మెతో అసువులు బాసిన 30 మంది ప్రాణాలు పోవడానికి కారకులు ఎవరు అని ఇప్పుడు కార్మికులు అశ్వత్థామరెడ్డిని ప్రశ్నిస్తున్న వీడియోలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్టీసీని తాకట్టు పెట్టి కార్మికుల ఉసురు తీశావ్ అంటూ నీకు ఉసురు తగులుతుంది అని అశ్వత్థామరెడ్డిపై కార్మికులు , సగటు నిరసన కారులు మండిపడుతున్నారు.
ఆర్టీసీ సమ్మె విరమించినా కార్మికులను చేర్చుకునేది లేదని కేసీఆర్ సర్కారు స్పష్టం చేసింది. లేబర్ కోర్టు తీర్పు వచ్చాక చూస్తామని అంటోంది. ఈ నేపథ్యంలో 52రోజులుగా సమ్మె చేసిన కార్మికుల కష్టం బూడిదలో పోసిన పన్నీరైపోయింది. కేసీఆర్ చెప్పినట్టు విని చేరినా ఇప్పుడు వారి ఉద్యోగాలు వారికి ఉండేవి. అశ్వత్థామరెడ్డి సహా కార్మిక నేతల మాటలు విని ఇప్పుడు ఉన్నది పోయింది.. ఉంచుకున్నది పోయిన చందంగా నడిరోడ్డున కార్మికుల పడాల్సిన పరిస్థితి ఎదురవుతోంది.. దీంతో ఈ పరిస్థితికి కారకులు ఎవరనే ప్రశ్న ఇప్పుడు అందరినోట నుంచి వెలువడుతుంది..
ఆర్టీసీ సమ్మె విరమణపై వీడియో : https://www.youtube.com/watch?v=BQM7hHNh_po