గత కొన్ని రోజులుగా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్న తీరుతో.. అసలు టీడీపీకి బలం ఎవరు? అనే ప్రశ్న తెరమీదికి వస్తోంది. ఎందుకంటే.. అసెంబ్లీలో తన ఫ్యామిలీకి ఘోర అవమానం జరిగిందని పేర్కొంటూ.. టీడీపీ అధినేత శోకాలు పెట్టారు. ఇది సెంటిమెంటుగా మారుతుందని అనుకున్నారు. అయితే,, అను కున్న మైలేజీ రాలేదు. దీంతో నందమూరి కుటుంబాన్ని లైన్‌లో పెట్టి.. వైసీపీ సర్కారుకు వార్నింగులు ఇప్పించారనే వాదన వినిపిస్తోంది. ఇవన్నీ చాలక.. జూనియర్ ఎన్టీఆర్ కేంద్రంగానూ.. నాయకులతో కామెంట్లు చేయించారు.
అంటే.. టీడీపీలో జోష్ పెరగాలంటే.. జూనియర్ వంటి వ్యక్తి.. ఫైర్ బ్రాండ్‌గా మారి.. హాట్ కామెంట్లు చేస్తే.. రాష్ట్రంలో అగ్గిపుట్టి.. రాజకీయ చలిమంటలు కాచుకునేందుకు టీడీపీ ప్రయత్నించిందా ? దీని నుంచి లబ్ది పొందాలని భావించిందా ? అనే ప్రశ్నలు తెరమీదకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అసలు టీడీపీకి బలం ఎవరు? వ్యూహం ఏంటి? అనే ప్రశ్నలకు సమాధానం వెతుకుతున్నారు.
వాస్తవానికి జూనియర్‌కు పార్టీకి మధ్య ఎక్కడా సంబంధం లేదు. మంత్రి పదవిని అనుభవించిన లోకేష్.. లేదా.. ఇతర నాయకులు స్పందించాల్సి ఉంది. కానీ, లోకేష్.. తీవ్రంగా స్పందించలేదు. పైగా.. మూడు రోజుల పాటు మౌనంగా ఉన్నారు. ఇక, ఆ తర్వాత.. స్పందించినా.. తీవ్ర వ్యాఖ్యలు చేయలేదు. దీనిని ఎలా అర్ధం చేసుకోవాలి ? పార్టీని బతికించుకునేందుకు ప్రయత్నించాల్సిన భావినాయకుడే ఇలా.. బేల వ్యాఖ్యలు చేస్తే.. ఎక్కడో తన మానాన తను బతుకుతున్న జూనియర్ వచ్చి.. పార్టీకి ఇప్పుడు అండగా మారి.. తను ఇరుక్కోవాలా ? అనేది ప్రశ్న.
అంటే.. పార్టీకి బలం జూనియర్ అని ఒప్పుకొంటున్నారా? లేక.. ఆయనను అడ్డు పెట్టి.. రాజకీయంగా లబ్ధి పొందాలనే వ్యూహంతో ముందుకు సాగుతున్నారా ? ఇలాంటి ప్రయత్నాలు చేయడం వల్ల పార్టీనే నష్టపోతుందని అంటున్నారు పరిశీలకులు.