ట్విట్టర్ ను సొంతం చేసుకున్న ఎలన్ మస్క్ అందులో సంస్కరణలు చేయడం మొదలుపెట్టారు. అప్పుడే విమర్శల వాడికి పదునుపెట్టారు. ప్రత్యేకించి తాను కోరుకుంటున్న ఫ్రీ స్పీచ్ కు ట్విట్టర్ లో ఎవరైతే అడ్డుపడుతున్నారో వాళ్లనే టార్గెట్ చేయడం మొదులపెట్టారు. ముఖ్యంగా ట్విట్టర్ పనితీరును ప్రభావితం చేస్తోన్న ఆ సంస్థ లీగల్ చీఫ్, తెలుగు మహిళ విజయ గద్దెను టార్గెట్ చేసుకున్నారు. ట్విట్టర్ విధాన నిర్ణయాల్లో ఈమె కీలక పాత్ర పోషిస్తున్నారు. తప్పుడు ప్రచారాన్ని అరికట్టడంలో.. డొనాల్డ్ ట్రంప్ లాంటి వ్యక్తుల ఖాతాలను బ్లాక్ చేయడంలో ముఖ్య భూమిక పోషించారు.
ఈ క్రమంలోనే ఎలన్ మస్క్ తాజాగా తెలుగు మహిళ అయిన విజయ గద్దెను టార్గెట్ చేశారు. ఆమె తీరుపై ట్విట్టర్ లో వరుస ట్వీట్లు చేశారు. ఎలన్ మస్క్ తాజాగా విజయను కమ్యూనిస్టు అంటూ ‘లెఫ్ట్ వింగ్’ అని నేరుగా ఆమె ఫొటోతో ట్వీట్లు చేశారు. ట్విట్టర్ ను ఎలన్ మస్క్ కొన్నప్పుడు బోర్డ్ మీటింగ్ లో విజయ ఎమోషనల్ అయ్యారు. మస్క్ చేతుల్లోకి ట్విట్టర్ వెళితే దాని పరిణామాలు దారుణంగా ఉంటాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. 2014 నుంచి ట్విట్టర్ కు చీఫ్ లీగల్ ఆఫీసర్ గా విజయ పనిచేస్తున్నారు. అప్పటి వ్యవస్థాపక చైర్మన్ జాక్ డోర్సే తో కలిసి ట్విట్టర్ లో కీలక మార్పులు చేశారు. టెక్సాస్ లో టాప్ లాయర్ అయిన 48 ఏళ్ల విజయ తనకు మూడేళ్ల వయసున్నప్పుడే కుటుంబంతో కలిసి టెక్సాస్ వచ్చి స్థిరపడింది. అమెరికన్ ను పెళ్లి చేసుకుంది.
ఇప్పుడు ఎలన్ మస్క్ ఈమెను ట్విట్టర్ నుంచి సాగనంపేందుకు సిద్ధమవుతున్నాడు. తెలుగు లేడీ విజయ ఒకవేళ ఎలోన్ మస్క్ చేత తొలగించబడితే $12.5 మిలియన్ డాలర్ల పరిహారం పొందుతుంది. ఇండియన్ అమెరికన్.. ట్విటర్ చీఫ్ లాయర్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి విజయ గద్దే అగ్రెసివ్ గా ముందుకెళుతున్నారు.. ఎలోన్ కంపెనీని కొనుగోలు చేసిన వెంటనే, అతను విద్యను లక్ష్యంగా చేసుకుని వరుస ట్వీట్లు చేశాడు.
మస్క్ భారీ రేటుకు ట్విట్టర్ ను కొన్నాక.. ఆర్థికంగా భారంగా ఉన్న వారిని..తనకు నచ్చని వారిని సాగనంపాలని చూస్తున్నారు. ఉద్యోగాలను తగ్గించాలని.. ఎగ్జిక్యూటివ్ వేతనాన్ని తగ్గించాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే విద్యా గద్దె సంవత్సరానికి 17 మిలియన్లు ట్విట్టర్ నుంచి సంపాదిస్తుంది. ఈమెను సాగనంపాలని మస్క్ యోచిస్తున్నారు.
తెలుగు మహిళ విజయను మస్క్ తీసేస్తే $12.5 మిలియన్ల పరిహారం పొందుతుంది. అందులో ఆమె సంపాదించిన ట్విట్టర్ షేర్ల యొక్క విలువను కూడా జోడించి చెల్లించాల్సి ఉంది. విద్యా గద్దేను 2020లో "మీరు ఎన్నడూ వినని అత్యంత శక్తివంతమైన టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్"గా ట్విట్టర్ అభివర్ణించింది. అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్విట్టర్‌లో డొనాల్డ్ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేస్తే ఆయన ఖాతాను బ్యాన్ చేయడానికి విజయ బాధ్యత వహించింది. అందుకే ఎలన్ మస్క్ ఈమెపై ఆగ్రహంగా ఉన్నారు. ట్రంప్ సైతం చాలా సార్లు విరుచుకుపడ్డారు.