విజయవాడ వైసీపీ మేయర్ అభ్యర్థి ఎవరు?

Update: 2021-03-07 15:56 GMT
ఏపీ రాజధాని ప్రాంతం విజయవాడలో రాజకీయాలు వేడెక్కాయి. టీడీపీ ఇప్పటికే విజయవాడ మేయర్ గా ఎంపీ కేశినేని నాని కూతురు శ్వేతను టీడీపీ ప్రకటించింది. దీనిపై సెగలు, పొగలు వచ్చినా చంద్రబాబు అండ్ టీం అసమ్మతిని చల్లార్చింది. చంద్రబాబు ఈరోజు ప్రచారాన్ని కూడా ప్రారంభించాడు.

ఏపీలో కీలకమైన ఈ బెజవాడ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిపై వైసీపీ అధిష్టానం గుంభనంగా వ్యవహరిస్తోంది. ఇప్పుడే మేయర్ అభ్యర్థిని ప్రకటిస్తే ఎన్నికల్లో దాని ప్రభావం కనపడుతుందని భావించిన వైసీపీ ఎన్నికల తర్వాత ప్రకటిస్తామని చెబుతోంది.

గత ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ మేయర్ పదవిని గెలిచింది. ఈసారి మాత్రం ఎలాగైనా రాజధాని ప్రాంతంలోని బెజవాడ మేయర్ సీటును కైవసం చేసుకోవాలని చూస్తోంది.

మేయర్ సీటు జనరల్ మహిళకు కేటాయించడంతో పలువురు ఆ పీఠం కోసం పోటీ పడుతున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ తరుఫున ఫ్లోర్ లీడర్ గా పనిచేసిన పుణ్యశీల ఈ వరుసలో ముందున్నారు. మంత్రి వెల్లంపల్లి ఆశీస్సులు కూడా ఈమెకే ఉన్నాయి.

ఇక బెజవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న లిఖితారెడ్డి కూడా మేయర్ సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈమె ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ గౌతం రెడ్డి కూతురు. సీఎం జగన్ కుటుంబంతో ఉన్న సన్నిహిత సంబంధాలతో లిఖితా కూడా మేయర్ సీటు కోసం అప్పుడే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇక బెజవాడ పశ్చిమ, తూర్పు నుంచి బరిలోకి దిగుతున్న కొత్తవారికి ఏమైనా సామాజిక సమీకరణాల నేపథ్యంలో మేయర్ పదవి ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు.




Tags:    

Similar News