ఆర్బీఐ గవర్నరుది అతి తెలివా? ఎకసెక్కమా?

Update: 2016-02-14 10:02 GMT
 వెనుకటికెవరో మోకాలికి - బోడిగుండుకు ముడివేస్తానన్నాడట.. రిజర్వు బ్యాంకు గవర్నరు రఘురామ్ రాజన్ తీరు కూడా అలాగే ఉంది. ధరల పెరుగుదలకు ఆయన చెబుతున్న కారణాలు విని జనం నోరెళ్లబెడుతున్నారు.  ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టినప్పటికీ దోశ ధర పెరగడానికి కారణం దోశలు తయారు చేసే విధానం సాంకేతికంగా అభివృద్ధి చెందకపోవడమేనని ఆర్బీఐ గవర్నర్‌ రఘురాం రాజన్‌ చెబుతున్నారు. దోశలు వేసే పద్ధతిలో ఎలాంటి మార్పు రాలేదు. దోశ పిండిని పెనం మీద వేసి పెనమంతా వచ్చేలా చుట్టూ తిప్పుతారని, దీనిలో ఎలాంటి సాంకేతిక అభివృద్ధి చోటు చేసుకోలేదని ఆయన అన్నారు. అయితే దోశలు వేస్తున్న వంటవాడికి చెల్లిస్తున్న జీతం పెరుగుతోందని ఆయన చెప్పారు. ఇవన్నీ ధరల పెరుగుదలకు కారణమన్నది ఆయన సూత్రం. ఫెడరల్‌ బ్యాంకు నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఒక ఇంజనీరింగ్‌ విద్యార్థిని అడిగిన ప్రశ్నకు రఘురాం రాజన్‌ ఈ సమాధానం ఇచ్చారు... ఆ సమాధానం విన్న విద్యార్థినికి మైండ్ బ్లాకయిపోయిందట.

ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు ధరలు పెరుగుతాయి, మరి ద్రవ్యోల్బణం తగ్గినప్పుడు ధరలు తగ్గాలి కదా అని ఒక ఇంజనీరింగ్‌ విద్యార్థిని ఆయనను ప్రశ్నించింది. సాంకేతికాభివృద్ధి లేని రంగాల్లో వస్తువుల ధరలు వేగంగా పెరుగుతాయని చెబుతూ రాజన్ ఈ ఉదాహరణ చెప్పారు. ఆర్థికవేత్తగా ఆయన లాజిక్ కొట్టిపారేయాల్సిందేమీ కాదు కానీ... ఆర్బీఐ గవర్నరే ఇలాంటి ఉదాహరణలు, సమాధానాలు చెబితే.. రేపు ఎవరైనా ఏ హోటల్లోనైనా ధరలపై ప్రశ్నిస్తే వారు ఆర్బీఐ గవర్నరే అలా అన్నారని కోట్ చేసే ప్రమాదం ఉంది.
Tags:    

Similar News