పాత వద్దు.. కొత్త ముద్దు... ?

Update: 2022-02-19 16:30 GMT
ఏపీలో రెండు ప్రధాన పార్టీలలో ఇపుడు ఒక ఆసక్తికరమైన పోలిక కనిపిస్తొంది. అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ రెండూ కూడా పాత రోత అనుకుంటున్నాయి. అదే టైమ్ లో కొత్త వారి కోసం సెర్చ్ చేస్తున్నాయి. ఒక విధంగా చెప్పాలి అంటే బాగా మోజు పడుతున్నాయి. కొత్తదనంతోనే రాజకీయంగా తాము కూడా ఫ్రెష్ గా ఉంటాయని భావిస్తున్నాయి. ముందుగా అధికార వైసీపీ విషయం తీసుకుంటే వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలవాలని గట్టిగా అనుకుంటోంది.

అందుకోసం ఎన్ని కఠిన నిర్ణయాలు అయినా తీసుకోవడానికి రెడీ అంటోంది. వైసీపీకి ఇపుడు 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇందులో వందకు పైగా ఎమ్మెల్యేలు కొత్త వారే. వారంతా ఫస్ట్ టైమ్ చట్ట సభలలో అడుగుపెట్టారు. అయితే వారిలో చాలా మంది పనితీరు బాలేదని రిపోర్టులు వస్తున్నాయట. అదే టైమ్ లో ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత అంతకంతకు పెరిగిపోతోందని పార్టీకి వేగులు అందిస్తున్న అతి ముఖ్య‌మైన సమాచారం.

దాంతో ఈసారి అలా వచ్చిన కొత్త వారిని తప్పించేసి వారి స్థానంలో కొత్త ముఖాలను జనాలకు పరిచయం చేయాలని వైసీపీ అధినాయకత్వం ఆలోచిస్తోంది అంటున్నారు. దాని కోసం ఇప్పటి ఉంచే తగిన అభ్యర్ధుల వేట కూడా స్టార్ట్ అయింది అంటున్నారు. అంగబలం, అర్ధ బలం ఉన్న కొత్త ముఖాలకు వైసీపీ టికెట్లు అని కూడా అంటున్నారు.

మరో వైపు చూస్తే టీడీపీ కూడా ఈసారి కొత్తవారినే  రాజకీయ తెరకు పరిచయం చేయాలని చూస్తోంది. టీడీపీ ఎపుడూ కూడా పాత కాపులకే టికెట్లు ఇస్తూ వస్తోంది. ఆ పార్టీ వయసు నాలుగు పదులు ఉంటే సీనియర్ నేతల వయసు ఆరున్నర‌ పదులు దాటిపోయింది. దాంతో టీడీపీ   ఈసారి మాత్రం ప్రయోగాలు చేయడానికి సిద్ధపడుతోంది అని అంటున్నారు.

అయితే టీడీపీ కొత్త ముఖాలలో ఎక్కువగా వారసులు ఉండవచ్చు అని కూడా అంటున్నారు. ఏది ఏమైనా ఈసారి ఏపీలోని అన్ని అసెంబ్లీ టికెట్లలో రెండు ప్రధాన పార్టీలలో చూసుకుంటే పాత వారు చాలా తక్కువగా కనిపిస్తారు అంటున్నారు. మరి ఈ కొత్త ప్రయోగం వైసీపీ టీడీపీలలో ఎవరికి కలసి వస్తుంది అన్నది చూడాలి.

ఇక టీడీపీ ఇలాంటి ప్రయోగాలు చేయడం ఇదే ఫస్ట్ టైమ్ అయితే వైసీపీ అధికారంలో ఉంది. కాబట్టి రెండు పార్టీలకు మేలు ఎంత వరకూ జరుగుతుందో తెలియదు కానీ రిస్క్ కూడా ఎంతో కొంత ఉంటుంది అని అంటున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ పెద్ద ఎత్తున సిట్టింగ్ ఎమ్మెల్యేలను తప్పిస్తే మాత్రం ఆ పార్టీకి రాజకీయంగా ఇబ్బందులు తెచ్చిపెట్టే పరిస్థితి కూడా ఉంటుందని అంటున్నారు.
Tags:    

Similar News