రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బ్యూటీషియన్ శిరీష అనుమానస్పద మృతి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తొలుత అనుమానాస్పద మృతిగా.. ఆపై కుకునూరుపల్లి ఎస్ ఐ ఆత్మహత్యకు శిరీష సూసైడ్ తో లింకు ఉందని ఆధారాలు సంచలనంగా మారాయి. అనంతరం.. శిరీష మృతికి సంబంధించి పలు అంశాలు పోలీసులు వెల్లడించటం తెలిసిందే.
తాను సన్నిహితంగా ఉండే రాజీవ్.. తేజస్విని అనే అమ్మాయిని ప్రేమిస్తున్నారన్న విషయం తెలిసి ఆమెను బెదిరించేందుకు తనకుతెలిసిన వారి సాయాన్ని శిరీష తీసుకుందన్న విషయం తాజాగా విడుదలైన ఆడియో క్లిప్ లు స్పష్టం చేస్తున్నాయి. ఊహించని రీతిలో గడిచిన రెండు రోజులుగా శిరీషకు సంబంధించిన రెండు ఆడియో క్లిప్ లు విడదలయ్యాయి. వీటిల్లో రాజీవ్ ను శిరీష ఎంతగా ఇష్టపడుతుందన్న విషయాలు బయటకు రావటమేకాదు.. తేజస్విని అంటే ఎంత కోపమోనన్న విషయం కూడా ఈ ఆడియోలు స్పష్టం చేస్తున్నాయి.
తేజస్విని రాజీవ్‌కు దూరం చేసేందుకు తనకు తెలిసిన వారి సాయాన్ని శిరీష తీసుకుందన్న విషయాన్ని ఈ ఆడియో క్లిప్ లు తేలుస్తున్నాయి. ఈ ఆడియో క్లిప్ లతో మరో రెండు కొత్త పేర్లు తెర మీదకు వచ్చాయి. శిరీష కోరినట్లుగా తేజస్విని బండబూతులు తిట్టేసి.. ఆమెను బెదిరించిన ఎపిసోడ్లో నందూ.. నవీన్ అనే పాత్రలు ఇప్పుడు బయటకు వచ్చాయి.
ఇంతకీ వారిద్దరు ఎవరు? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. వారికి.. శిరీషకు మధ్యనున్న సంబంధం ఏమిటి? వారు శిరీషకు ఏమవుతారు? అన్న ప్రశ్నలకు సమాధానాలు వెతికే ప్రయత్నంలో పోలీసులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఒకటి తర్వాత ఒకటిగా బయటకు వస్తున్న ఆడియో క్లిప్ లు ఎవరు విడుదల చేస్తున్నారు? దాని వెనుక ఉన్నదెవరు? అన్న ప్రశ్నలు కొత్తగా వినిపిస్తున్నాయి. విడుదలైన రెండు ఆడియో క్లిప్ లు శిరీషను బద్నాం చేసేలా ఉన్నాయన్న మాట వినిపిస్తోంది.
ఈ ఉదంతంలో అరెస్ట్ అయిన రాజీవ్‌కు సాయం చేసేందుకు.. అతడ్ని సేవ్ చేసేందుకే ఈ కాల్ రికార్డింగ్ క్లిప్ లు బయటకు తెస్తున్నారా? అన్నది ప్రశ్నగా మారింది. అదే సమయంలో ఎంపిక చేసిన ఆడియో క్లిప్ లను చూసుకున్నాకే విడుదల చేస్తున్నారా? అన్న సందేహం కూడా తలెత్తుతోంది. ఈ ఆడియో క్లిప్‌ల విడుదల వెనుక ఉద్దేశం ఏమిటన్న అంశంపైనా పోలీసులు దృష్టి సారిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆడియో క్లిప్పుల విడుదల నేపథ్యంలో తలెత్తిన కొత్త ప్రశ్నలకు సమాధానాలు ఎప్పుడు లభిస్తాయో? ఈ కేసు ఒక కొలిక్కి ఎప్పుడు వస్తుందన్నది ఇప్పుడు పెద్ద సందేహంగా మారింది.