ప్రపంచ ఆరోగ్య సంస్థ నేతృత్వంలోని కరోనా వ్యాక్సిన్ పరిహార పథకం కరోనా వ్యాక్సిన్ల నుండి ఏవైనా దుష్ప్రభావాలకు గురయ్యే పేద దేశాలలో ప్రజలకు పరిహార నిధిని ఏర్పాటు చేస్తోంది. ఇది ప్రపంచవ్యాప్త వ్యాక్సిన్ వినియోగంపై భయాలను తొలగించే లక్ష్యంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ అందిస్తుంది . గ్లోబల్ వ్యాక్సిన్ కూటమి అయిన డబ్ల్యూహెచ్ ఓ, గావి సహకారంతో కోవాక్స్ వ్యాక్సిన్ యొక్క ప్రమోటర్లు ఈ పథకాన్ని ఏర్పాటు చేస్తున్నారని కోవాక్స్ వెల్లడించింది. 2021 చివరి నాటికి కనీసం 2 బిలియన్ల ప్రభావవంతమైన వ్యాక్సిన్ లను పంపిణీ చేయాలని కోవాక్స్ లక్ష్యంగా పెట్టుకుంది. 92 తక్కువ ఆదాయ దేశాలకు, ఎక్కువగా ఆఫ్రికా మరియు ఆగ్నేయ ఆసియాలో ఈ వ్యాక్సిన్ పరిహార పథకాన్ని అందించబోతున్నారు.
ఈ భీమా పథకం ప్రకారం కోవాక్స్ పంపిణీ చేసిన వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత ఏదైనా అనుకోకుండా వారికి వ్యాక్సిన్ వల్ల ఏమైనా దుష్ప్రభావాలు వస్తే వారికి పరిహారం చెల్లించాలని నిర్ణయం తీసుకుంది . అయితే దక్షిణాఫ్రికా, లెబనాన్, గాబన్, ఇరాన్ మరియు చాలా లాటిన్ అమెరికన్ రాష్ట్రాలు వంటి మధ్య ఆదాయ దేశాలకు ఈ రక్షణ ఇవ్వబడదని స్పష్టం చేసింది. కోవాక్స్ ఫెసిలిటీ 92 దేశాలలో పరిహారం అందించే వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది . రెగ్యులేటరీ ఆమోదం పొందిన టీకా నుండి ప్రతికూల ప్రభావాలు చాలా అరుదుగా ఉన్నప్పటికీ, కరోనా వ్యాక్సిన్ షాట్ల గురించి ప్రజల ఆందోళన పెరిగింది. దీనితో కోవాక్స్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
ఇకపోతే , అంతర్జాతీయంగా ఆమోదించబడిన కరోనా వైరస్ వ్యాక్సిన్ ఇప్పటివరకు అయితే రాలేదు. ప్రస్తుతం చాలా దేశాల్లో వ్యాక్సిన్ పై ప్రయోగాలు చివరి స్థాయిలో ఉన్నాయి. కాని, ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం మొదటిది డిసెంబరు నాటికి సిద్ధంగా ఉంటుంది. కోవిడ్ వ్యాక్సిన్ పరిహార పథకం కింద, కోవాక్స్ వ్యాక్సిన్లను ఉపయోగించే దేశాలు కనీసం 2022 జూలై వరకు వ్యాక్సిన్ తయారీదారులకు నష్ట పరిహారం ఇవ్వనున్నారు. టీకాల తయారీదారులు తమకు సేఫ్టీ , సెక్యూరిటీ అందించని దేశాలలో వ్యాక్సిన్లు పంపిణీ చెయ్యబోమని కోవాక్స్ తెలిపింది. ప్రపంచంలో మూడ్రోజులుగా రోజూ 5లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. నిన్న కొత్తగా 5,71,425 మందికి కరోనా వచ్చినట్లు తేలింది. మొత్తం పాజిటివ్‌ల సంఖ్య 4,58,90,083కి చేరింది. నిన్న కొత్తగా 7,473 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 11,93,200కి చేరింది. మొత్తం రికవరీ కేసులు 3,32,37,111 ఉండగా... యాక్టివ్ కేసులు 1,14,59,772కి చేరాయి. వీటిలో 83,186 మందికి కండీషన్ సీరియస్‌గా ఉంది. ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో కరోనా సోకిన ప్రతి 100 మందిలో ఇద్దరు లేదా ముగ్గురు చనిపోతున్నారు.