‘అస్ట్రాజెనికా’ తో ఏ ప్రాబ్లం లేదు.. అవన్నీ రూమర్స్.. డబ్ల్యూహెచ్‌వో..!
ఇటీవల ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. మనదేశంతో పాటు వివిధ దేశాల్లోనూ వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతున్నది. ఇదిలా ఉంటే ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్‌తో రక్తం గడ్డగడుతోందని.. పలువురు మరణించారని ఊహాగానాలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పలు యూరప్ దేశాల్లో ఆస్ట్రాజెనికా పంపిణీని నిలిపివేశారు. ఈ నేపథ్యంలో ఈ అంశంపై డబ్ల్యూహెచ్‌వో క్లారిటీ ఇచ్చింది. ఆస్ట్రాజెనికాతో ఎటువంటి సైడ్ఎఫెక్ట్స్ లేవని.. మిగతా వ్యాక్సిన్ల లాగే అది కూడా సమర్థవంతంగా పనిచేస్తుందని డబ్ల్యూహెచ్‌వో తేల్చిచెప్పింది. యూరప్ కు చెందిన ఎనిమిది దేశాలు ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ పంపిణీ ని నిలిపి వేశాయి. ఈ విషయం పై డబ్ల్యూహెచ్‌వో ఏమందంటే.. ’కొన్ని దేశాలు ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను నిలిపివేశాయి. ఇందుకు ఏ మాత్రం సహేతుక కారణాలు లేవు’ అంటూ డబ్ల్యూహెచ్ఓ క్లారిటీ ఇచ్చింది.
ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్‌పై డబ్ల్యూహెచ్‌వో ఓ కమిటినీ నియమించింది. దీంతో సదరు కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా డబ్ల్యూహెచ్‌వో ఈ మేరకు ప్రకటన చేసింది. 'వ్యాక్సినేషన్ కారణంగా మరణాలు సంభవించాయని చెప్పే ఎలాంటి రుజువులు ఇప్పటివరకు లభించలేదు. వ్యాక్సిన్‌ల పంపిణీ సమయంలో ఎలాంటి భద్రతా సమస్యలు ఎదురైనా, వాటిని తప్పకుండా సమీక్షించుకోవాలి. ఆస్ట్రాజెనెకా టీకా పంపిణీని కొనసాగించాలి' అని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికార ప్రతినిధి మార్గరెట్ హ్యారిస్ స్పష్టంచేశారు.
ఆస్ట్రియాలో ఓ నర్సుకు ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ ఇవ్వగా కొన్ని రోజుల్లోనే ఆమె కన్నుమూసింది. ఆమెకు రక్తం గడ్డింది. డెన్మార్క్, నార్వే, ఎస్తోనియా, లత్వియా, లుత్వేనియా, లక్సంబర్గ్ దేశాల్లోనే ఈ టీకాతో కొన్ని సమస్యలు రావడంతో ఆయా దేశాల్లో వ్యాక్సినేషన్ నిలిపివేశారు. దీంతో డబ్ల్యూహెచ్‌వో తాజాగా స్పందించింది. ఆస్ట్రాజెనికా సురక్షితమని పేర్కొన్నది. ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఇప్పటివరకు ఎవ్వరూ మరణించలేదని.. తేల్చిచెప్పింది. ఇందుకు సంబంధించిన శాస్త్రీయ ఆధారాలు ఏవి లేవని పేర్కొన్నది.
మరోవైపు ఈ వివాదంపై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి స్పందించారు. ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘ అస్ట్రాజెనికా వ్యాక్సిన్ తీసుకొని ప్రపంచవ్యాప్తంగా చాలా మంది చని పోయారు. కొన్ని దేశాలు ఆ వ్యాక్సిన్ పంపిణీ ని నిలిపివేశాయి. అయితే మన దేశంలో సీరం ఇన్స్టిట్యూట్ అనే సంస్థ అదే ఫార్ములాతో కోవిషీల్డ్ అనే వ్యాక్సిన్ తయారుచేస్తున్నది. మనదేశంలో కూడా విరివిగా ఈ వ్యాక్సిన్‌ను పంపిణీని చేస్తున్నారు. ప్రభుత్వాలు ఈ విషయం గురించి ఏమైనా ఆలోచిస్తున్నాయా’ అంటూ ఆయన ఓ ట్వీట్ పెట్టారు. ఇప్పుడు ట్వీట్ వైరల్‌గా మారింది.