ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ తయారుచేసిన ఆస్ట్రాజెనికా టీకాపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఈ టీకా తీసుకొని పలుదేశాల్లో ప్రజలకు రక్తం గడ్డకడుతున్నది. దీంతో ఆయా దేశాల్లో ప్రజల్లో భయాందోళనలు నెలకొంటున్నాయి. ఇప్పటికే పలు దేశాలు ఆస్ట్రాజెనికా టీకాను నిషేధించాయి. ఈ టీకాతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్లేవని.. డబ్ల్యూహెచ్‌వో ప్రకటించినప్పటికీ కొన్ని దేశాల్లో భయాందోళనలు పోలేదు. తాజాగా ఐర్లాండ్ ఆస్ట్రాజెనికా టీకాపై నిషేధం విధించింది. ఇప్పటికే డెన్మార్క్, నార్వే, ఆస్ట్రియా, ఎస్టోనియా, లిథువేనియా, థాయిలాండ్, ఐస్‌లాండ్ దేశాలు ఆస్ట్రాజెనెకా టీకాను నిషేధించాయి. ఆయా దేశాల్లో ఈ టీకా తీసుకున్న వారికి రక్తం గడ్డకడుతున్నది. దీంతో పలు దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నది.
ప్రస్తుతం మనదేశంలో సీరం ఇన్స్టిట్యూట్ తయారుచేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ కూడా ఆక్స్ఫర్డ్ సహకారంతోనే రూపొందించారు. అయితే మనదేశంలో రక్తం గడ్డకడుతున్న కేసులు నమోదు కాలేదు. ఆస్ట్రాజెనెకా టీకా తీసుకున్న ముగ్గురు ఐర్లాండ్ ఆరోగ్య కార్యకర్తల్లో తీవ్రమైన రక్తస్రావం, రక్తం గడ్డకట్టడం, బ్లడ్ ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గిపోవడం వంటివి కనిపించాయని ఆ దేశ వైద్య అధికారులు తెలిపారు. టీకా తీసుకున్న వారిలో దుష్ప్రభావాలు కనిపిస్తుండడంతో ఐర్లాండ్ నేషనల్ ఇమ్యునైజేషన్ అడ్వైజరీ కమిటీ (ఎన్ఐఏసీ) వ్యాక్సినైజేషన్‌ను తాత్కాలికంగా నిలిపివేయాలని ప్రతిపాదించింది. డబ్ల్యూహెచ్‌వో మాత్రం ఈ టీకాతో ఎటువంటి దుష్ప్రభావాలు లేవని చెబుతున్నది. యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ ఇదే అభిప్రాయాన్ని వెల్లడించింది. ప్రపంచదేశాలు ఆస్ట్రాజెనికాను నిషేధించడంతో మనదేశంలో పంపిణీ చేస్తున్న కోవిషీల్డ్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కోవిషీల్డ్ పంపిణీపై సమగ్రంగా పరిశీలన జరుపుతున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఆస్ట్రాజెనికా, కోవిషీల్డ్ రెండు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సహకారంతోనే తయారయ్యాయి. అయితే మనదేశంలో భారత్ బయోటెక్ రూపొందించిన కోవాక్జిన్ .. సీరం ఇన్స్టిట్యూట్ వారి కోవిషీల్డ్ పంపిణీ ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటకే తొలిదశ వ్యాక్సినేషన్ కూడా పూర్తయింది.