కరోనా: చైనాకు అనుకూలంగా డబ్ల్యూహెచ్ ఓ..ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్

Update: 2020-04-08 12:10 GMT
అమెరికాలో కరోనా వైరస్ మరణమృదంగం సృష్టిస్తుంది. కరోనా వైరస్‌ ను కట్టడికి ప్రపంచంలోని సగానికిపైగా దేశాల్లో పూర్తిగా - పాక్షికంగా లాక్‌ డౌన్‌‌ లు కొనసాగుతున్నాయి. దీంతో ప్రపంచ జనాభాలో సగం మందికి పైగా జనం ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 1,431,689 మంది వైరస్ బారినపడగా - 82వేల మంది బలయ్యారు. కరోనా వైరస్‌ కు హాట్‌ స్పాట్‌ గా ఉన్న న్యూయార్క్‌ రాష్ట్రంలో మృత్యు ఘోష కొనసాగుతోంది. ఇక్కడ 24 గంటల్లో 731 మంది చని పోయారు. దీంతో ఈ వైరస్‌ బారినపడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 5,489కు చేరింది. ఒక్క న్యూయార్క్‌ నగరంలోనే 2,738 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఈ మహమ్మారిని  నియంత్రించడానికి ట్రంప్ యంత్రాంగం అహర్నిశలు శ్రమిస్తున్నా కూడా , కరోనా వైరస్ కంట్రోల్ లోకి రాలేదు. అలాగే, రాబోయే రోజుల్లో మరిన్ని విపత్కర పరిస్థితులు ఎదురు కాబోతున్నాయని  నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ అసహనానికి గురౌతున్నాడు. హైడ్రాక్సీ క్లోరోక్విన్ విషయంలో భారత్ సానుకూలంగా స్పందించకుంటే ప్రతీకార చర్యలు తీసుకునే వారమని ట్రంప్ నోరుజారడం కూడా  విమర్శలకు దారి తీసింది.

తాజాగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ పై ట్రంప్ విమర్శలు గుప్పించారు. డబ్ల్యూహెచ్ ఓ   చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపణలు గుప్పించారు. వైరస్‌ వెలుగు చూసిన తొలినాళ్ల లో దాని తీవ్రత గురించి డబ్ల్యూహెచ్ ఓ  వద్ద సమాచారం ఉన్నా పంచుకోవడానికి ఇష్టపడ లేదని, కరోనా  విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎన్నో  తప్పటడుగులు వేసిందని  విమర్శలు గుప్పించారు. చైనాలో కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో అక్కడ పర్యటించిన విదేశీయులు తమ దేశంలోకి రాకుండా జనవరి 31న నిషేధం విధిస్తే డబ్ల్యూహెచ్‌ఓ వ్యతిరేకించిందని గుర్తుచేశారు.

డబ్ల్యూహెచ్ ఓ  కే తామే అత్యధికంగా నిధులు సమకూరుస్తున్నామని వ్యాఖ్యానించిన ట్రంప్.. ఆ నిధుల్ని నిలిపివేస్తున్నట్టు సంచలన నిర్ణయం తీసుకున్నారు. అయితే, డబ్ల్యూహెచ్ ఓ  పై ట్రంప్ ఆరోపణలు చేయడం ఇదే తొలిసారి కాదు. డబ్ల్యూహెచ్ ఓ  కు 58 నుంచి 122 మిలియన డాల్లర్ల మేర నిధులు కేటాయించాలని ఈ ఏడాది ఫిబ్రవరి లో ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. 2020-21 ఏడాదికి 114,766,922 డాలర్లు అమెరికా అందజేయనున్నట్టు డబ్ల్యూహెచ్‌ ఓ  ఇటీవల ప్రకటించింది.
Tags:    

Similar News