దేశ ప్రధాని నరేంద్ర మోడీ భద్రతా వలయం ఎంత కట్టుదిట్టంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు అత్యున్నత స్థాయి భద్రతను ఏర్పాటు చేసినట్లుగా చెబుతుంటారు. అలాంటిది ఆయన క్వాన్వాయ్ లోకి ఆరో తరగతి చదివే కుర్రాడు.. చేతిలో పూలమాలతో ప్రధాని కారుకు అత్యంత సమీపానికి వచ్చిన తాజాగా వైనం షాకింగ్ గా మారింది. భారీ భద్రతా ఏర్పాట్లు చేసినప్పటికి చిన్న పిల్లాడు దండ తీసుకొని అంతలా దూసుకురావటం ఎలా సాధ్యమైంది? ఇంతకీ ఆ పిల్లాడు ఎందుకు ఆ పని చేసినట్లు? దాని వెనుకున్న కారణాల్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు పోలీసులు.
కర్ణాటకలో నిర్వహిస్తున్న నేషనల్ యూత్ ఫెస్టివల్ ప్రోగ్రాంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ రావటం తెలిసిందే. ఈ సందర్భంగా హుబ్బళ్లిలో రోడ్ షో చేశారు. కదిలే కారులో తన సీటునుంచి దిగి.. డోర్ పక్కన నిలబడి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగిన వైనం తెలిసిందే. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉన్న వేళ..
ర్యాలీగా వెళుతున్న మోడీ వద్దకు ఒక పిల్లాడు చేతిలో పూలమాలతో రావటం కలకలం రేపింది. అతడ్ని ప్రధాని భద్రతా అధికారులు పక్కకు నెట్టేసి..స్థానిక పోలీసులకు అప్పజెప్పగా.. అతడు అందించిన పూలమాలను పట్టుకునేందుకు ప్రధాని నరేంద్ర మోడీ చేయి జాచిన వైనం వైరల్ వీడియోలో నమోదైంది.
ప్రధాని కాన్వాయ్ వెళ్లిపోగా.. పూలదండతో కాన్వాయ్ లోకి దూసుకొచ్చిన కుర్రాడ్ని స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకొని.. అతని కుటుంబాన్ని స్టేషన్ కు పిలిచి విచారణ చేపట్టారు. ఆరో తరగతి చదివే ఆ కుర్రాడికి ప్రధాని నరేంద్ర మోడీ అంటే ప్రాణమని.. పిచ్చి అభిమానమని అందుకే అలా చేసినట్లుగా గుర్తించారు.
ఆ కుర్రాడి చిన్నాన కొడుక్కి రెండున్నరేళ్లు. వాడికి ఆర్ఎస్ఎస్ యూనిఫాం వేసి.. ఆ పిల్లాడితో ప్రధాని నరేంద్ర మోడీ మెడలో దండ వేయాలని ఆ కుర్రాడు భావించాడు. కానీ.. రోడ్ షో చేస్తున్న ప్రధాని మోడీ తన వైపు కనీసం చూడలేదన్న ఆలోచనతో బారికేడ్ల కింద నుంచి దూకేసి మోడీ మెడలతో దండ వేసే ప్రయత్నం చేశారు.
అతన్నిప్రధాని భద్రతా దళం చివరి క్షణాల్లో అతన్నిపక్కకు నెట్టేయటం.. అతన్నిస్థానిక పోలీసులు అదుపులోకి తీసుకోవటం జరిగిపోయాయి. అయితే.. ప్రధాని మోడీకి దండ వేసే విషయంలో ఎలాంటి దురుద్దేశం లేదని.. కేవలం అభిమానంతోనే అలాంటి పని చేసినట్లుగా గుర్తించి.. కుటుంబ సభ్యుల్ని.. ఆ కుర్రాడ్ని విడిచి పెట్టారు. తమను స్టేషన్ నుంచి బయటకు తీసుకురావటంతో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి.. ఇతర సీనియర్ బీజేపీ నేతలు తమకు అండగా నిలిచినట్లుగా సదరు కుర్రాడి కుటుంబ సభ్యులు చెబుతుండటం గమనార్హం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.