200 బిలియన్ డాలర్లను కోల్పోయిన మొదటి వ్యక్తి ఎవరంటే?

Update: 2022-12-31 14:30 GMT
అపర కుబేరుడు.. టెస్లా అధినేత ఎలన్ మస్క్ సంపద క్రమంగా తరిగిపోతుంది. ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్ ను కొనుగోలు చేయడానికి ఎలన్ మస్క్ భారీ మొత్తంలో ఖర్చు చేశాడు. ట్విట్టర్ ను చేజిక్కించుకునేందుకు ఎలన్ మస్క్ టెస్లా లోని తన వాటాను కొంతమేరకు విక్రయించాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ట్విట్టర్ కొనుగోలు ప్రక్రియ ప్రపంచంలోనే అతిపెద్ద డీల్ గా మారింది.

ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ అయిన టెస్లాలో ఎలన్ మస్ అతిపెద్ద వాటా దారుడిగా ఉన్నారు. అయితే ట్విట్టర్ కోసం ఎలన్ మస్క్ టెస్లాలో తనకున్న వాటాలో నాలుగు బిలియన్ డాలర్ల షేర్లను అమ్మేశారు. వీటి విలు సుమారు 32 వేల కోట్లు ఉంటుందని అంచనా. ఎలన్ మస్క్ తన వాటాను విక్రయించడంతో టెస్లాలోని ఇన్వెస్టర్లు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు.

ఈ ప్రభావంతో టెస్లా షేర్లు ఒక్కసారిగా కుప్పకూలి పోయాయి. దీంతో ప్రపంచ కుబేరుడి సంపద ఒక్కసారిగా తగ్గిపోయింది. ఈ మేరకు మస్క్ 200 మిలియన్ డాలర్ల క్లబ్ నుంచి బయటకు వచ్చేశాడు. అప్పటి వరకు 200 బిలియన్ డాలర్ల క్లబ్బులో మస్క్ ఒక్కడే ఉన్నాడు. ట్విట్టర్ కొనుగోలు.. ఆర్థిక మాంద్యం.. ఇతర తప్పుడు నిర్ణయాలతో ఎలన్ మస్క్ సంపద ఈ ఏడాది భారీగా పడిపోయిందని తెలుస్తోంది.

ఈక్రమంలోనే ఎలన్ మస్క్ తన నికర ఆస్తుల విలువ నుంచి $200 బిలియన్లను కోల్పోయిన తొలి వ్యక్తిగా నిలిచాడని బ్లూమ్‌బెర్గ్ తాజాగా వెల్లడించింది. నవంబర్ 2021లో ఆయన సంపద $340 బిలియన్లకు చేరుకుందని పేర్కొంది. అయితే ఈ నెల ప్రారంభంలో బెర్నార్డ్ ఆర్నాల్ట్ అతన్ని అధిగమించే వరకు సైతం ఎలనే ప్రపంచంలోనో నెంబర్ వన్  ధనవంతుడి ఉన్నాడని పేర్కొంది.

అయితే టెస్లాలో తన వాటాను అమ్మడం వల్ల అతడి నికర విలువ ప్రస్తుతం 137 బిలియన్ డాలర్లకు చేరింది. ఈ ఏడాది టెస్లా షేర్లు పతనం కావడంతో అతడి మరింత క్షీణించింది. ఎలన్ మస్క్ ఇటీవలి కాలంలో టెస్లాను పట్టించుకోకుండా ట్విట్టర్ పైనే ఫోకస్ చేస్తుండటంతో ఎలక్ట్రిక్ కార్లలో టెస్లా తన ఆధిపత్యం కోల్పోయే ప్రమాదంలో పడింది. ఈ నేపథ్యంలోనే ట్విటర్ కొనుగోలు అనేది ఎలన్ మస్క్ ను పెద్దగా దెబ్బతీసిందని అభిప్రాయం వ్యక్తమవుతోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News