ప్రతీ ఐదేళ్లకోసారి జనాలు ఓటు వేస్తారు. తమను పాలించేవారిని ఎన్నుకుంటారు. ఆ తీర్పే ఫైనల్. ఐదేళ్ల పాలనను చూసి అధికార పక్షాన్నా? ప్రతిపక్షాన్నా? అనేది వాళ్లు ఎన్నుకుంటారు.లోక్ సభ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉండగానే అప్పుడే ఎగ్జిట్ పోల్స్, ఓపీనియన్ పోల్స్ వెల్లువెత్తుతున్నాయి. కొన్ని సర్వే సంస్థలు, మీడియా సంస్థలు.. ప్రజల అభిప్రాయాలను సేకరించి మరీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరిది అధికారం అనేది బయటపెడుతున్నాయి.
తాజాగా ప్రముఖ జాతీయ మీడియా 'టైమ్స్ నౌ' కూడా అదే చేసింది. దేశవ్యాప్తంగా ఓపినియన్ పోలీస్ నిర్వహించింది. అందులో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. ప్రజా వ్యతిరేకత బోలెడంత ఉ్నా కూడా మూడోసారి కేంద్రంలో కొలువుదీరేది బీజేపీయేనని ఈ సర్వే తేల్చడం గమనార్హం. మొత్తం 543 లోక్ సభ స్థానాలకు గాను బీజేపీ 292-312 స్థానాలు గెలుచుకొని అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని ఈ పోల్ పేర్కొంది.
ఇక కాంగ్రెస్ పార్టీ 118-138 సీట్లకే పరిమితం అవుతుందని తెలిపింది. ఇక థర్డ్ ఫ్రంట్ అంటోన్న టీఎంసీ 27-31 సీట్లు, వైసీపీ 17-23, ఆప్ 8-12, టీఆర్ఎస్ 6-10 సీట్లు , ఇతరులు 40-52 సీట్లు సాధిస్తారని టైమ్స్ నౌ తేల్చింది.
ఇప్పటికే మోడీని కొట్టే నాయకుడు కనుచూపు మేరలో లేడని ఈ సర్వే తేల్చింది. మోడీకి ప్రధాన పోటీదారు విషయంలోనూ పోల్ నిర్వహించగా.. రాహుల్ గాంధీ 22 శాతంతో ముందు వరుసలో నిలిచారు. ఆ తర్వాత స్థానాల్లో కేజ్రీవాల్ 19 శాతం, మమతాబెనర్జీ 13 శాతం, ప్రియాంకా గాంధీ 11శాతం, సీఎం కేసీఆర్ 4శాతం, ఇతరులు 31 శాతం ఉన్నారు.
కొద్దిరోజులుగా జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెడుతానని కలలుకంటున్న కేసీఆర్ కు టౌమ్స్ నౌ సర్వే శరాఘాతంగా మారింది.ఈ సర్వే జాతీయ స్థాయిలో నిర్వహించగా తెలంగాణలో మాత్రమే ఉన్న కేసీఆర్ కు పోలింగ్ శాతం ప్రభావం చూపినట్టైంది.
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్ 6-10 ఎంపీ సీట్లకు మాత్రమే పరిమితం అవుతారని.. కేసీఆర్ పీఎం రేసులో కేవలం 4శాతం మాతమ్రే ఓట్లు సంపాదించారని సర్వే తేల్చింది. కేసీఆర్ కంటే కూడా జాతీయస్థాయిలో రాహుల్, కేజ్రీవాల్, మమతా బెనర్జీ, ప్రియాంకాగాంధీలు ముందు నిలవడం విశేషం. అయితే కేసీఆర్ ఇంకా జాతీయ స్థాయిలో పార్టీ పెట్టకపోవడం..విధివిధానాలు ప్రకటించకపోడం.. జనాల్లోకి వెళ్లకపోవడమే ఈ ఓటింగ్ తగ్గడానికి కారణం అంటున్నారు.