సీఎం అయ్యేది తండ్రా.. కొడుకా?

Update: 2019-11-22 07:13 GMT
మహా రాజకీయం అంతకంతకూ మలుపులు తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాక చోటు చేసుకున్న పరిణామాలతో సుదీర్ఘకాలం సాగిన బీజేపీ.. శివసేన మధ్య బంధం బీటలు వారటం.. కొత్త మిత్రుల సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు సాగుతున్న సంగతి తెలిసిందే. ఏది ఏమైనా తమకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలన్న శివసేన డిమాండ్ ను సాధించేలా ప్రయత్నాలు చేస్తున్నారు.

సేన కోరుకున్నట్లుగా మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పక్షంలో ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చునేది ఎవరు? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సీఎం అయ్యేది ఉద్దవ్ థాక్రేనా? ఆయన కుమారుడు ఆదిత్య ఠాక్రేనా? అన్నది మరో ప్రశ్నగా మారింది
.
తన కుమారుడ్ని ముఖ్యమంత్రి కుర్చీలో చూడాలన్నది ఉద్దవ్ కలగా చెప్పాలి. ఇప్పటికే పలుమార్లు ఆయన ఆ విషయాన్ని స్పష్టం చేశారు కూడా. అయితే.. సొంత పార్టీతో పాటు.. భాగస్వామ్య పక్షాలైన ఎన్సీపీ.. కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతలు మాత్రం ఉద్దవ్ ను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోవాలని.. కొడుక్కి సీఎం కుర్చీ ఇవ్వటం సరికాదన్న మాటను చెబుతున్నారు.

ఠాక్రే కుటుంబం నుంచి తొలిసారి సార్వత్రిక ఎన్నికల బరిలో దిగి గెలిచిన ఆదిత్యను సీఎం చేయటం సరికాదంటున్నారు.వయసులో చిన్నవాడు మాత్రమే కాదు.. తొలిసారి ఎమ్మెల్యేగా అతనికున్న అనుభవం చాలా తక్కువని.. ఎంతోమంది సీనియర్లు ఆయనతో పని చేయటానికి ఇబ్బంది పడతారన్న వాదన వినిపిస్తోంది.

అయితే.. ఉద్దవ్ సతీమణి మాత్రం తన కొడుకును సీఎం కుర్చీలో చూడాలన్న అంశం మీద మాత్రం బలంగా ఉన్నట్లు చెబుతున్నారు. తొలిసారి అధికారపక్షంగా ఆవిర్భవిస్తున్న వేళ.. రాజకీయాల్లో సీనియర్ అయినా ఉద్దవ్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టటం సరైనదన్న మాట వినిపిస్తోంది. పార్టీ నేతలు.. మిత్రపక్షాలు చేస్తున్న వినతుల్నిపక్కన పెట్టేసి కొడుకు మీద ఉన్న ప్రేమతో సీఎం కుర్చీ ఆదిత్యకు ఇవ్వాలని పట్టుబడతారా? లేక.. మిత్రుల మాట వింటారా? అన్నది మరో రెండు..మూడు రోజుల్లో క్లారిటీ వస్తుందంటున్నారు.
Tags:    

Similar News