ఏపీ టాక్‌: అధికారం మాటేమో.. కానీ, అప్పులు తీర్చేదెవ‌రు..?

Update: 2022-10-14 03:45 GMT
ఏపీలో అధికారంలోకి వ‌చ్చేందుకు.. పార్టీలు ఉబ‌లాట‌ప‌డుతున్నాయి. దీనిని ఎవ‌రూ త‌ప్పు ప‌ట్టాల్సిన అవ‌స‌రం లేదు. ఎందుకంటే.. ఏ రాజ‌కీయ పార్టీ అయినా.. అంతిమ ల‌క్ష్యం.. పాలించ‌డం.. అధికారం చ‌లాయించ‌డం. సో.. ఏ పార్టీ అయినా.. అధికారంలోకి రావాల‌ని అనుకోవ‌డం త‌ప్పుకానేకాదు. ఈ క్ర‌మం లోనే ఏపీలో అధికారంలోకి వ‌చ్చేందుకు ప్ర‌స్తుతం టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీలు పోటీ ప‌డుతున్నాయి. ఏ పార్టీకి ఆ పార్టీ.. ప్ర‌య‌త్నాలు కూడా.. ముమ్మ‌రం చేస్తున్నాయి.

ఇక‌, అధికారంలో ఉన్న వైసీపీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ అదికారం ద‌క్కించుకునేందుకు ఇప్ప‌టి నుంచే వ్యూహ ప్ర‌తివ్యూహాల‌తో రాజ‌కీయాల‌ను వేడెక్కిస్తోంది. అయితే.. ఇక్క‌డ పెద్ద స‌మ‌స్య ఏంటంటే.. ఏ పార్టీ అధికారంలోకి వ‌చ్చినా.. అప్పులు తీర్చేదెలా? అనేదే! సామాన్యుల్లో ఈ చ‌ర్చ లేక‌పోయినా.. రాజ‌కీయ పండితులు.. మేధావులు మాత్రం ఈ ప్ర‌శ్నే సంధిస్తున్నారు. ఇక‌, జ‌య‌ప్ర‌కాశ్ నారాయ‌ణ వంటి మాజీ ఐఏఎస్‌లు కూడా.. ఏపీ అప్పులు తీర్చే పార్టీ క నుచూపు మేర‌లో క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు.

ఎందుకంటే.. గ‌త చంద్ర‌బాబు పాల‌న వ‌ర‌కు 3 ల‌క్ష‌ల కోట్లుగా ఉన్న అప్పుల‌ను మూడేళ్ల కాలంలో జ‌గ‌న్ పాల‌న.. తారాజువ్వ మాదిరిగా.. 7 ల‌క్ష‌ల పైచిలుకు కోట్ల‌కు తీసుకువెళ్లింది.

ప్ర‌జ‌ల‌కు ఉచిత ప‌థ‌కాల పందేరాల‌ను ఆపేది లేద‌ని.. అవ‌స‌ర‌మైతే.. మ‌రిన్ని అప్పులు చేస్తామ‌ని.. ఇది త‌ప్పు కూడా కాద‌ని.. స‌చివులు వెల్ల‌డిస్తున్నారు. అంతేకాదు.. ఎవ‌రైనా అప్పుల గురించి మాట్లాడితే.. మీకు లేదా అప్పు? అంటూ.. ఎదురు దాడి చేస్తున్నారు.

ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. మ‌రో రెండేళ్ల‌పాటు వైసీపీ అధికారంలోనే ఉంటుంది. ఈ క్ర‌మంలో మ‌రిన్ని ప‌థ‌కాల‌ను.. ప్ర‌జ‌ల‌కు అందించేందుకు మ‌రిన్ని అప్పులు చేయాల్సిన ప‌రిస్థితి త‌ప్పేలా లేదు. ఎందుకంటే.. ఎక్క‌డా కూడా.. ప్ర‌జ‌ల‌పై పన్నుల రూపంలో వ‌స్తున్న ఆదాయం మిన‌హా.. ఉత్ప‌త్తి ఆధారిత ఆర్థిక రాబ‌డి రాష్ట్రానికి ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. ఒక్క పెట్టుబ‌డి లేదు.. ఆదాయం లేదు. దీనిని కూడా స‌మ‌ర్ధించుకుంటున్నార‌ను కోండి!  ఇది వేరే సంగతి.

ఇలా చూసుకుంటే.. ఏపీ అప్పు వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి సుమారుగా 10 ల‌క్ష‌ల కోట్ల‌కు పైగానే చేరిపోతుంద ని అంటున్నారు ఆర్తిక నిపుణులు.దీనిని బ‌ట్టి.. దీనికి చెల్లించాల్సిన వ‌డ్డీ.. క‌నీసంలో క‌నీసం 6% వేసుకు న్నా.. 60 వేల కోట్ల రూపాయ‌లు ఉంటుంది. సో.. ఈ మొత్తం చెల్లించ‌డంతోపాటు.. వ‌చ్చే ప్ర‌భుత్వం అప్పులు చెల్లించాల్సిన అవ‌స‌రం ఉంటుంది. మ‌రి దీనిని ఎదుర్కొనే నిల‌బ‌డే ప్ర‌భుత్వం ఏదా? అనేది మేధావుల ప్ర‌శ్న‌. ఎవ‌రు వ‌చ్చినా.. ఏపీని బాగు చేయ‌డం ఇప్ప‌ట్లో సాధ్యం కాద‌ని చెబుతున్నారు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News