మంచు రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేదెవరు?

Update: 2022-11-10 04:49 GMT
మంచు రాష్ట్రంగా పేరున్న హిమాచల్ ప్రదేశ్ లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ ఘట్టానికి మరో మూడు రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రంలో తదుపరి అధికారంలోకి వచ్చేదెవరు. అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఈ నెల 12న రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ జరుగుతుండగా.. ఫలితాలు డిసెంబరు 8న గుజరాత్ ఫలితాలతో కలిపి వెల్లడించనున్నారు.
హిమాచల్ ప్రదేశ్ లో మొత్తం 68 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా..

అధిక సీట్లను బీజేపీనే గెలుచుకునే వీలుందన్న అభిప్రాయాన్ని ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి.. మరోసారి అధికారపీఠం దక్కనుందన్న మాట పలువురి నోట వినిపిస్తోతోంది.  ఇప్పటివరకు వినిపిస్తున్న అంచనాల ప్రకారం చూస్తే.. అధికార బీజేపీకి 34 సీట్ల నుంచి 44 సీట్ల వరకు గెలిచే వీలుందని చెబుతున్నారు.

అదే సమయంలో కాంగ్రెస్ కు 24 స్థానాల నుంచి 28 స్థానాల వరకు వచ్చే వీలుందంటున్నారు. ఇతరులకు రెండు స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందంటున్నారు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో పోటీ ఏకపక్షంగా ఉంటే.. మరికొన్ని జిల్లాల్లో మాత్రం బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య పోటాపోటీగా సాగుతోంది. అధికార బీజేపీ బలంగా ఉన్న జిల్లాల విషయానికి వస్తే.. చంబా.. మండీ.. హమీర్ పూర్.. ఉనా జిల్లాల్లో బీజేపీ హవా ఎక్కువగా ఉంది.

కాంగ్రెస్ బలంగా ఉన్న జిల్లాలు ఒక్కటి కూడా లేనప్పటికీ.. కొన్నిజిల్లాల్లో మాత్రం అధికార బీజేపీతో సమానంగా పోటీ పడటం ఆసక్తికర అంశంగా చెప్పాలి. పదిహేను నియోజకవర్గాలు ఉన్న కంగ్రా జిల్లాలో బీజేపీ.. కాంగ్రెస్ బలం సమానంగా ఉందని.. అక్కడ చెరో ఏడు సీట్లు చొప్పున ఇరు పార్టీలు గెలిచే వీలుంది.

మరో స్థానాన్ని మాత్రం ఇతరులు కైవశం చేసుకునే వీలుంది. దీంతో పాటు నాలుగు స్థానాలు ఉన్న కులు జిల్లాలోనూ ఇరు పార్టీలకు సమాన అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా చూస్తే.. బీజేపీ మరోసారి అధికారంలోకి రావటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News