భారత దేశం ప్రపంచానికి పెద్దన్నను అని జబ్బలు చరచుకుని గర్వించకపోవచ్చు. ఆధిపత్య పోరులో ముందుకు దూసుకు వచ్చి అహంకారాన్ని చాటుకోకపోవచ్చు. కానీ భారత్ మాటకు ప్రపంచాన చాలా విలువ ఉంది. భారత్ పలుకుబడి ఇటీవల కాలంలో చాలా పెరిగింది. పైగా విశ్వశాంతిని కోరుకునే ఏకైక దేశం భారత్.
అలాంటి భారత్ అంతార్జాతీయంగా వేగంగా మారుతున్న పరిణామాల నేపధ్యంలో కీలక పాత్ర పోషించాలన్న డిమాండ్ అయితే ముందుకు వస్తోంది. రష్యా ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం వద్దు అని భారత్ చాలా చెప్పి చూసింది. అంతర్జాతీయంగా కూడా ఇప్పటిదాకా భారత్ తటస్థ వైఖరినే అవలంబించింది.
అయితే ఇపుడు ఒక్కసారిగా సీన్ మారిపోయింది. ఈ నేపధ్యంలో భారత్ కచ్చితమైన స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం ఉందన్న వాదన కూడా వినిపిస్తోంది. ఒక విధంగా చెప్పాలీ అంటే భారత్ కి ఉక్రెయిన్ తో పాటు రష్యా ముఖ్యమే. అదే విధంగా చూసుకుంటే అమెరికా ఇతర పశ్చిమ దేశాలతో భారత్ సాన్నిహిత్యాన్ని నెరుపుతోంది.
భారత్ భవిష్యత్తు అవసరాలు ఆయా దేశాలతో ముడిపడి ఉన్నాయి. దాంతో అమెరికా కూడా రష్యా ఉక్రెయిన్ వివాదంతో తమకు భారత్ అండగా ఉంటుందని ఆశించింది. అయితే తటస్థ విధానమే తన రూటు అని భారత్ ఇప్పటికే చెప్పుకుంది. కానీ ఇపుడు పరిస్థితి చేయి దాటిపోయింది. తప్పనిసరిగా భారత్ కూడా తన వైఖరి ఏదో చెప్పాలా అన్న చర్చ కూడా వస్తోంది.
ఈ పరిణామాలు ఇలా ఉండగానే భారత్ లోని ఉక్రెయిన్ రాయబారి ఐగర్ పోలికా భారత్ మద్దతుని గట్టిగా కోరుకున్నారు. ప్రస్తుత సంక్లిష్టమైన పరిస్థితులను పరిష్కరించే శక్తియుక్తులు భారత్ కి మాత్రమే ఉన్నాయని ఆయన అంటున్నారు. భారత్ ఈ రోజున ప్రపంచంలో కీలకమీన పాత్రని పోషిస్తోంది అని కూడా ఆయన గుర్తు చేశారు.
భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాత్ర పోషిస్తునన్ గొప్ప నాయకుడు అని కూడా ఆయన కీర్తించారు. ప్రస్తుత సమయంలో భారత్ తటస్థ వైఖరి విడనాడాలని, పరిష్కార దిశగా ముందుకు వెళ్లాలని ఆయన కోరుకుంటున్నారు. మరి భారత్ దీని మీద స్పందిస్తుందా అన్నది కూడా ఆసక్తికరేమే.
ఇక రష్యా మనకు మిత్ర దేశంగా కొన్ని దశాబ్దాలుగా ఉండేది. కానీ మూడు దశాబ్దాల క్రితం సోవియట్ రష్యా విచ్చిన్నం కావడంతో ప్రపంచ పరిణామాలు మారాయి. అమెరికా పెద్దన్నగా మారింది. భారత్ కూడా అమెరికా వైపు చూస్తూ వచ్చింది. ఇక రష్యా వరకూ చూసుకుంటే చైనాకు గట్టి మద్దతుగా ఉంటోంది.
చైనాతో భారత్ కి ఎన్నో విషయాల్లో వివాదాలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో కూడా భారత్ రష్యాతో ఇంకా సన్నిహిత సంబంధాలను నెరపుతోంది. కానీ ఒకసారి అంతర్జాతీయంగా సమాజం చీలిపోయే పరిస్థితే వస్తే కనుక చైనా రష్యా ఒక్కటి అవుతాయి. మరి భారత్ తాను కూడా ఒక స్టాండ్ తీసుకుంటే అది ఫ్యూచర్ లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేలా చూడాలి
ఇప్పటికైతే భారత్ రష్యా ఉక్రెయిన్ వివాదాన్ని చర్చల ద్వారానే పరిష్కారమని అంటోంది. కానీ సీన్ చూస్తే వేరేగా ఉంది. నాటో దేశాలు వర్సెస్ రష్యాగా కధ మారినపుడు భారత్ కూడా డిసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమో చూడాలి.