అప్పు మీద అప్పు చేసుకుంటూ పోతున్న ఏపీ సర్కారు దెబ్బకు రాష్ట్ర అప్పు గరిష్ఠానికి చేరుకుంది. సింపుల్ లెక్కలో చెప్పాల్సి వస్తే.. గడిచిన 66 ఏళ్లలో ఏపీ ప్రభుత్వాలు చేసిన అప్పు రూ.3.14 లక్షల కోట్లు అయితే.. ప్రస్తుతం రాష్ట్ర అప్పు రూ.7లక్షల కోట్లుగా పేర్కొన్నారు ఏపీ విపక్ష నేత.. టీడీపీ అధినేత చంద్రబాబు. వైఎస్ జగన్ సర్కారు చేసే అప్పుల లెక్క మీద ప్రెస్ మీట్ పెట్టిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆస్తుల్ని తాకట్టు పెట్టటమే పనిగా పెట్టుకున్నారని.. తానే చివరి ముఖ్యమంత్రినని.. ఇక రాష్ట్రం ఉండదని జగన్ అనుకుంటున్నారేమో? అంటూ ఎద్దేవా చేసిన చంద్రబాబు.. ‘‘వ్యక్తులు మారుతారు కానీ లెక్కలు శాశ్వితం. ప్రభుత్వానికి కొన్ని లెక్కలు ఉంటాయి. ఏం జరిగిందో చరిత్ర మొత్తం డాక్యుమెంటేషన్ తో ఉంటుంది. రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోయింది. అప్పును రూ.7లక్షల కోట్లకు తీసుకెళ్లిన వారిని ఏమనాలి? రాష్ట్ర భవిష్యత్తును ముఖ్యమంత్రి జగన్ అంధకారం చేశారు. రాజ్యాంగ వ్యవస్థల్నిధ్వంసం చేశారు’’ అని మండిపడ్డారు.
అప్పుల కోసం ప్రభుత్వ ఆస్తుల్ని పెద్ద ఎత్తున తాకట్టు పెడుతున్నారన్న చంద్రబాబు.. ఏపీలోని ప్రతి కుటుంబం మీదా రూ.5 నుంచి 6 లక్షల వరకు అప్పు నెత్తిన ఉందని.. అదంతా ప్రభుత్వం చేసిన అప్పుల ఫలితమన్నారు.
ప్రజల నుంచి బలవంతంగా పన్నులు వసూళ్లు చేస్తున్నారని.. ఎక్కడ దొరికితే అక్కడ రాష్ట్రంలో ఆస్తులన్నీఅమ్మేస్తున్నారన్నారు. ‘‘ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెడుతున్నారు. కలెక్టరేట్లు.. రెసిడెన్షియల్ స్కూళ్లు.. బెర్మ్ పార్కు.. రోడ్లు కూడా తాకట్టు పెట్టారు. ప్రైవేటు ఆస్తుల్ని కూడా తాకట్టు పెట్టేస్తారు. అప్పుల్లో ఉన్నాం.. ఎవరమూ తప్పించుకోలేం. ఆకాశం నుంచి ఎవరూ రారు. మనమే కట్టాలి. మరోవైపు పన్నులు విపరీతంగా పెంచారు’’ అని చంద్రబాబు ధ్వజమెత్తారు.
జగన్ ప్రభుత్వానికి దమ్ము.. ధైర్యం ఉంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద శ్వేతపత్రం విడుదల చేయాలన్న చంద్రబాబు.. వైసీపీ నేతలు కోటీశ్వరులు అవుతుంటే.. పేదలు నిరుపేదలుగా మారుతున్నారన్నారు. ప్రతి నెల పేదలపై వేలాది రూపాయిల అదనపు భారం పడుతోందని.. రాష్ట్ర పరిస్థితి ఏమిటో ప్రజలు.. ఉద్యోగుల్లో చైతన్యం వస్తే తప్ప ప్రభుత్వారాచకాలకు అడ్డుకట్ట వేయలేమన్నారు.
రూ.2లక్షల కోట్ల సంపద ఉన్న అమరావతిని నాశనం చేశారని.. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన జగన్ ను చరిత్ర క్షమించదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. చంద్రబాబు తాజా ప్రెస్ మీట్ చూస్తే.. గతంలో మాదిరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అదే పనిగా విమర్శించటం కాకుండా.. గణాంకాలతో సహా వివరాల్ని వెల్లడిస్తున్న వైనం చూస్తే.. బాబు తన ట్రాక్ ను కాస్త మార్చారన్న అభిప్రాయం కలుగక మానదు.