తెలంగాణలో కారు జోరు తరువాత అందరూ.. ‘అంతా మీరే చేశారు’ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు వైపే వేలు చూపిస్తున్నారు. ప్రజాకూటమిలోకి చంద్రబాబు ప్రవేశం - ఆయన ప్రచారంతో దారుణంగా దెబ్బతిన్నామన్న వాదన కాంగ్రెస్ - జనసమితి నేతల నుంచి వినిపిస్తోంది. అయితే... చంద్రబాబు - కాంగ్రెస్ కలవడం వల్ల నిజంగా ఎవరికి నష్టం జరిగిందన్న విషయంలో మరో వాదనా వినిపిస్తోంది. చంద్రబాబు వల్ల కాంగ్రెస్ కు జరిగిన నష్టం కంటే చంద్రబాబుకు జరిగిన నష్టమే ఎక్కువని టీడీపీ నేతలు అంటున్నారు. అందుకు ఎన్నికల గణాంకాలే ఆధారంగా చూపుతున్నారు.
2014లో రాష్ట్ర విభజన సమయంలో జరిగిన ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంటు పతాక స్థాయిలో ఉన్న సమయంలో కూడా తెలంగాణలో టీడీపీ 15 సీట్లు గెలిచింది. 14.7 శాతం ఓట్లు సాధించింది. కానీ, 2018 ఎన్నికల్లో టీడీపీ ఓట్ షేర్ 3.5 శాతానికి పడిపోయింది. సాధించిన సీట్లు కూడా కేవలం రెండే.
కాంగ్రెస్ తో పొత్తు కారణంగా టీడీపీ కేవలం 13 సీట్లకే పోటీ చేసింది. పొత్తు కారణంగా టీడీపీ ఓటు బ్యాంకు కాంగ్రెస్ కు మళ్లింది. కానీ... టీడీపీకి కాంగ్రెస్ ఓట్లు వచ్చిన పరిస్థితి కనిపించలేదు. కాంగ్రెస్ ఓట్ పర్సంటేజ్ 2014 కంటే 4.2 శాతం పెరగడమే దీనికి ఉదాహరణ.
సో.... తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ తో జట్టు కట్టి నష్టపోయింది తామేనని టీడీపీ నేతలు అంటున్నారు. మరి.. ఏపీ ఎన్నికల్లో ఎలాంటి స్టాండ్ తీసుకుంటారో చూడాలి.