పార్లమెంట్ నియోజకవర్గం: చేవెళ్ల
టీఆర్ ఎస్: రంజిత్ రెడ్డి
కాంగ్రెస్: విశ్వేశ్వర్ రెడ్డి
బీజేపీ: జనార్దన్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలోని చేవెళ్ల లోక్ సభ నియోజకవర్గం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. రాష్ట్రమంతా టీఆర్ ఎస్ గాలి వీస్తుండడంతో కాంగ్రెస్ నాయకులంతా టీఆర్ ఎస్ లోకి చేరుతుండగా..ఇక్కడ గెలిచిన టీఆర్ ఎస్ ఎంపీ మాత్రం కాంగ్రెస్ లో చేరడం అందరినీ విస్తుగొలిపించింది. టీఆర్ ఎస్ మాజీ మంత్రి మహేందర్ రెడ్డితో విభేదించి ఆ పార్టీ తరుపున సిట్టింగ్ ఎంపీగా ఉన్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి గులాబీ తోట నుంచి బయటికి వచ్చారు. అంతేకాకుండా కాంగ్రెస్ తరుపున ప్రస్తుతం బరిలో ఉన్నారు. ఇక తమ పార్టీపై నిందారోపణలు చేసిన విశ్వేశ్వర్ రెడ్డిని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్న గులాబీ బాస్ ఆయనపై రంజిత్ రెడ్డి అనే బిల్డర్ ను పోటీగా పెట్టాడు. ఇక బీజేపీ నుంచి సైతం ధనిక నేత అయిన జనార్దన్ రెడ్డి పోటీలో ఉన్నారు. ముగ్గురు ఆర్థికంగా బలమైన నేతలు కావడంతో చేవెళ్లలో డబ్బు ప్రవాహం కూడా బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో చేవెళ్లలో శ్రీమంతుడెవరోనన్నట్లు ఆసక్తికరంగా చర్చ సాగుతోంది.
* చేవెళ్ల లోక్ సభ నియోజకవర్గం చరిత్ర:
ఓటర్లు: 24 లక్షల 42వేలు
అసెంబ్లీ నియోజకవర్గాలు: మహేశ్వరం, రాజేంద్రనగర్, శేర్ లింగంపల్లి, వికారాబాద్, తాండూర్ పరిగి, చేవెళ్ల, రాజేంద్రనగర్
నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా 2009లో చేవెళ్ల లోక్ సభ నియోజకవర్గం అవతరించింది. మొదటిసారి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి సూది జయపాల్ రెడ్డి టీడీపీ అభ్యర్థి జితేందర్ రెడ్డిపై విజయం సాధించారు. 2014లో జరిగిన పోరులో టీఆర్ ఎస్ అభ్యర్తి కొండా విశ్వేశ్వర్ రెడ్డి జయకేతనం ఎగురవేశారు. ఈ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ లో చేరి అ పార్టీ తరుపున పోటీ చేస్తున్నారు.
* పార్టీ మారిన 'కొండ'ను ఆదరిస్తారా..?
2014 ఎన్నికల్లో 70 వేలకు పైగా మెజారిటీతో కొండా విశ్వేశ్వర్ రెడ్డి గెలుపొందారు. మాజీ ఉప ముఖ్యమంత్రి కొండా వెంకటరంగారెడ్డి మనువడైన విశ్వేశ్వర్ రెడ్డి స్థానికుడు.. కావడంతోపాటు ఆర్థికంగా బలమున్న నేత. అలాగే అపోలో వైద్య సంస్థల అధినేత ప్రతాప్ రెడ్డికి స్వయాన అల్లుడు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ ఎస్ తో విభేదించి బయటకు వచ్చిన ఆయన కాంగ్రెస్ నుంచి గెలుస్తానని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. డబ్బు బాగా ఖర్చు పెట్టగల స్థోమత ఉండడం. చేవెళ్ల పరిధిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచి ఉండడంతో ఈయన గెలుపుపై ఆశలు పెంచుకున్నారు.
* అనుకూలతలు:
-ఎంపీగా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం
-వివాదరహితుడిగా పేరు
-సిట్టింగ్ ఎంపీ కావడం
* ప్రతికూలతలు:
-కాంగ్రెస్ పార్టీ బలహీనపడడం
-స్థానికంగా పట్టు సాధించకపోవడం
-రాజకీయం కంటే వ్యాపారంపైనే మొగ్గు
* టీఆర్ ఎస్ పార్టీ అండతో రంజిత్ రెడ్డి బరిలోకి..
పౌల్ట్రీ వ్యాపారవేత్త అయిన రంజిత్ రెడ్డి కూడా ఆర్థిక బలమున్న నేత. ఇక్కడ సిట్టింగ్ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి టీఆర్ ఎస్ ను వీడడంతో ఆపార్టీ నుంచి పోటీ చేసే అవకాశాన్ని రంజిత్ రెడ్డి దక్కించుకున్నారు. ప్రత్యర్థిని ఓడించడమే లక్ష్యంగా మాజీ మంత్రి మహేందర్ రెడ్డితో పాటు పార్టీ అధినేత అండదండలు జితేందర్ రెడ్డికి పుష్కలంగా ఉన్నాయి. అలాగే కాంగ్రెస్ లోకి మాజీ మంత్రిగా పనిచేసిన మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కూడా టీఆర్ ఎస్ లోకి రావడంతో ఆయనకు మరింత బలం చేకూరింది. సబితా, ఆమె కుమారుడు కూడా టీఆర్ ఎస్ కు అండగా ఉండడంతో రంజిత్ రెడ్డి బలంగా ముందుకెళ్తున్నారు.
* అనుకూలతలు:
- తాండూరు మినహా అన్ని నియోజకవర్గాల్లో టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు ఉండడం
-మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మహేందర్ రెడ్డి అండదండలు
-స్థానికేతరుడైనా నియోజకవర్గంలో పట్టు సాధించడం
* ప్రతికూలతలు:
-మొదటిసారిగా లోక్ సభ బరిలో పోటి చేయడం
-క్షేత్రస్థాయిలో కేడర్ లేకపోవడం
-సొంతగా ఇమేజ్ లేకపోవడం
*టఫ్ ఫైట్ లో గెలుపెవరిది?
ఇక బిజేపీ నుంచి ప్రభావం చూపుతానని జనార్దన్ రెడ్డి బరిలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాలు, మోడీ ఇమేజ్ తో తన గెలుపు ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రధాన పోరు మాత్రం కాంగ్రెస్, టీఆర్ ఎస్ మధ్యే ఉండనుంది. బలమైన ధనవంతులుగా ఉన్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి పార్టీ మారాకా కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. దీంతో ఆయనను ఓడించడమే లక్ష్యంగా కేసీఆర్ పెట్టుకున్నారు. మాజీ మంత్రి మహేందర్ రెడ్డి బాధ్యతగా తీసుకొని గెలిపించడానికి ప్రయత్నిస్తున్నారు. కొండా కూడా డబ్బు, పరపతితో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. దీంతో అంతిమంగా మాత్రం ప్రధాన పోరు టీఆర్ ఎస్, కాంగ్రెస్ ల మధ్యే ఉంటుందని అంటున్నారు.