పార్లమెంట్ నియోజకవర్గం : కరీంనగర్
టీఆర్ ఎస్: బోయినపల్లి వినోద్ కుమార్
కాంగ్రెస్ : పొన్నం ప్రభాకర్ గౌడ్
బీజేపీ : బండి సంజయ్
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం.. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ కు ఎంతో అచ్చివచ్చిన ప్రాంతం. అలాంటి ప్రాంతంపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి ఉంటుంది. ఎంతోమంది దిగ్గజ నేతలు ఇక్కడి నుంచి ఎంపీగా పోటీచేశారు.కేసీఆర్ సైతం ఇక్కడి నుంచే ఎంపీ అయ్యారు. ఎం సత్యానారాయణ, చొక్కారావు, విద్యాసాగర్ రావు(మహారాష్ట్ర గవర్నర్), కేసీఆర్ లాంటి మహామహులు ప్రాతినిధ్యం వహించిన కరీంనగర్ ఎంపీ సీటులో ఈసారి పోరు ఆసక్తిగా మారింది. వెలమల కోటగా పేరొందిన కరీంనగర్ పార్లమెంట్ కు ఈసారి బలమైన టీఆర్ ఎస్ వెలమ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ ను బీసీలైన కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ గౌడ్, బీజేపీ నుంచి బండి సంజయ్ లు ఢీకొంటున్నారు. ముగ్గురు బలమైన నేతలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్దండులు పేరు ఉండడంతో ఇక్కడ గెలుపు ఎవరిదనేది ఆసక్తిగా మారింది.
*కరీంనగర్ పార్లమెంట్ చరిత్ర
కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో కరీంనగర్, సిరిసిల్ల, వేములవాడ, మానకొండూర్, హుజూరాబాద్, హుస్పాబాద్, చొప్పదండి నియోజకవర్గాలున్నాయి.
1952లో కరీంనగర్ లోక్ సభ నియోజకవర్గం ఏర్పడింది. మొదట్లో కాంగ్రెస్ కు కంచుకోటగా ఉండేది. మధ్యలో టీడీపీ సత్తా చాటింది. ఆ తర్వాత బీజేపీ నుంచి విద్యాసాగర్ రావు ఎంపీగా గెలిచి కేంద్రం హోంశాఖ సహాయమంత్రి అయ్యారు. కరీంనగర్ నుంచే కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని మొదలు పెట్టడం విశేషం. 2004లో కేసీఆర్ కరీంనగర్ ఎంపీగా గెలిచారు. ఇక 2009లో కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఇక్కడ టీఆర్ ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ ను ఓడించాడు. ఇక 2014 ఎన్నికల్లో టీఆర్ ఎస్ ఊపులో వినోద్ కుమార్ ఎంపీగా గెలిచాడు. కరీంనగర్ లోక్ సభ స్థానంలో మొత్తం 16,32,824 మంది ఓటర్లున్నారు.
*టీఆర్ ఎస్ అభ్యర్థి బోయినపల్లి బలంగా..
రాష్ట్రంలో టీఆర్ ఎస్ అధికారంలో ఉండడం. కరీంనగర్ టీఆర్ ఎస్ కు కంచుకోటగా ఉండడం.. టీఆర్ ఎస్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తనను గెలిపిస్తాయని టీఆర్ ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ ధీమాగా ఉన్నారు. కేంద్రంలో మంచి పలుకుబడితో అభివృద్ధికి వినోద్ నిధులు తీసుకొచ్చి మెరుగైన ఫలితాలు రాబట్టాడు. ఈసారి కూడా తనదే గెలుపు అంటున్నాడు. అయితే స్థానికేతరుడు కావడం ఈయనకు ఇక్కడ మైనస్ గా మారింది. కరీంనగర్ వాస్తవ్యుడు కాకపోవడంతో ఇదే విషయాన్ని ప్రత్యర్థులు ఎత్తిచూపుతున్నారు.
*ఫైర్ బ్రాండ్ పొన్నం బలమైన వాడే..
కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా.. ఫైర్ బ్రాండ్ గా పొన్నం ప్రభాకర్ కు పేరుంది. స్థానికుడు కావడంతో ఈయనకు ప్రజల్లో మాంచి ఫాలోయింగ్, మాస్ లీడర్ గా పేరుంది. కాగా యూపీఏ హయాంలో ఎంపీగా గెలిచిన పొన్నం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు. తెలంగాణ కోసం పార్లమెంట్ లో పెప్పర్ స్ప్రేకు గురై ఉద్యమకారుడిగా పేరొందాడు. కరీంనగర్ గొంతుకగా.. ఓటర్లు తనను గెలిపిస్తారని ఆశిస్తున్నారు.
*బండిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు..
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన బండిసంజయ్ టీఆర్ ఎస్ అభ్యర్థిని దాదాపు ఓడించినంత పనిచేశాడు. ముస్లిం ఓట్లు టీఆర్ ఎస్ కు పడకపోతే గెలిచేవాడే.. బండి మంచి లీడర్ గా.. స్థానికుడిగా.. యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ప్రజలకు అందుబాటులో ఉండే యువనేతగా దూసుకుపోతున్నారు. ఈయనకు భారీగానే ఓట్లు చీల్చే సామర్థ్యం ఉంది.
*కరీంనగర్ లో గెలుపెవరిదో చెప్పడం కష్టం..
కరీంనగర్ లోక్ సభ ఎన్నికల్లో ఈసారి త్రిముఖ పోటీ నెలకొంది. టీఆర్ఎస్ బలంగా ఉన్నా పొన్నం, బండిని తక్కువ అంచనావేయడానికి లేదంటున్నారు. జాతీయ కోణంలో ఎన్నికలు జరిగితే.. ఓటర్లు ఆలోచిస్తే మాత్రం పొన్నం, బండికి అవకాశాలుంటాయి. కానీ టీఆర్ ఎస్ ఢీకొని వీరిద్దరూ నిలబడతారా అన్నది వేచిచూడాలి.