మొదటి వేవ్ అయిపోయింది. సెకండ్ వేవ్ చివరకు వచ్చినట్లుగా చెబుతున్నారు. ఇప్పుడు చర్చ మొత్తం థర్డ్ వేవ్ మీద మొదలైంది. ప్రపంచాన్ని చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తున్న మహమ్మారికి తర్వాతి అడుగు ఎలా ఉంటుంది? థర్డ్ వేవ్ తీవ్రత ఏ మాత్రం? ఎప్పుడు వచ్చే వీలుందన్న సందేహాలు ఇప్పుడు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. సెకండ్ వేవ్ విషయంలో జరిగిన పొరపాట్లు.. థర్డ్ వేవ్ లో చోటు చేసుకోకూడదన్న ఉద్దేశంతో.. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే థర్డ్ వేవ్ సన్నాహాకాల్ని సిద్ధం చేస్తోంది.
ఈ క్రమంలో థర్డ్ వేవ్ లో పిల్లలే టార్గెట్ అవుతారన్న మాట జోరుగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో థర్డ్ వేవ్ లో పిల్లలే టార్గెట్ అవుతారా? అందులో నిజమెంత? అన్న విషయాలపై వెల్లువెత్తుతున్న ప్రశ్నలకు నిపుణుల సమాధానాలు భిన్నంగా ఉంటున్నాయి. ఆ మాటకు వస్తే.. థర్డ్ వేవ్ పిల్లలపై ప్రభావం చూపుతుందని ఇంకా నిర్దారణ కాలేదన్నారు. మరి.. ఈ వాదన ఎలా మొదలైందన్న సందేహానికి సమాధానం ఏమంటే.. మొదటి దశలో పెద్ద వయసు ఉన్న వారు ఎక్కువగా ప్రభావితం కావటం తెలిసిందే.
ఆ సమయంలో యువత.. పిల్లలు పెద్దగా బయటకు వెళ్లకపోవటం.. ఇంటికే పరిమితం కావటంతో తొలి దశలో యువత పెద్దగా ఎఫెక్టు కాలేదు. దీనికి తోడు స్కూళ్లు..కాలేజీలు.. సినిమాహాళ్లు.. మాల్స్ లాంటివి మూతపడటం కూడా యూత్ వైరస్ బారిన పడలేదు. కానీ.. సెకండ్ వేవ్ లో.. అందుకు భిన్నమైన పరిస్థితి. అన్ని తెరిచి ఉండటం.. దాదాపు ఆరేడు నెలల పాటు ఇంటికి దూరంగా ఉండటంతో.. విపరీతంగా బయటకు రావటం.. తిరగటం ఎక్కువైంది. అదే.. సెకండ్ వేవ్ లో యూత్ వైరస్ బారిన పడే అవకాశాన్ని ఇచ్చింది.
దీనికి తోడు.. పెద్దవారిలో ఇమ్యూనీటీ ఏర్పడటంతో పాటు.. కొందరు వ్యాక్సిన్ తీసుకోవటంతో.. యువత వైరస్ బారిన పడటానికి కారణమైంది. ఇక.. థర్డ్ వేవ్ లో వైరస్ వెతుక్కుంటూ పిల్లల్ని టార్గెట్ చేయటం ఏమీ ఉండదని చెబుతున్నారు. పెద్ద వారిలో ఇప్పటికే హెర్డ్ ఇమ్యునిటీ రావటంతో.. మిగిలిన వారిలో ఎక్కువ మంది వ్యాక్సిన్ వేయించుకోవటం.. యువత కూడా వ్యాక్సిన్ బాటలోకి వచ్చేయటంతో.. చివరకు మిగిలేది పిల్లలే కాబట్టి.. వారు ఎక్కువగా వైరస్ బారిన పడే ప్రమాదం పొంచి ఉందని చెబుతున్నారు. సో.. థర్డ్ వేవ్ అన్నది మొదలైతే.. పిల్లల్ని భద్రంగా ఉంచేందుకు.. ఇంట్లోని పెద్దలు మరింత కేర్ ఫుల్ గా ఉంటే మహమ్మారి దరి చేరే అవకాశం ఉండదన్న మాట వినిపిస్తోంది.