బాబు వాళ్ల‌నెందుకు టార్గెట్ చేయ‌డం లేదు!

Update: 2021-04-13 09:30 GMT
తిరుప‌తి పార్ల‌మెంటు స్థానానికి జ‌రుగుతున్న ఉప ఎన్నిక‌ను సీరియ‌స్‌గా తీసుకున్న టీడీపీ అధినేత చం ద్ర‌బాబు.. త‌నే స్వ‌యంగా రంగంలోకి దిగి ప్ర‌చారం చేస్తున్నారు. వాస్త‌వానికి ఉప ఎన్నిక‌ను ఏ పార్టీ అధినే త అయినా.. సీరియ‌స్‌గా తీసుకునే ప‌రిస్థితి లేదు. కానీ, ఇప్పుడున్న ప‌రిస్థితిలో స్థానిక ఎన్నిక‌ల్లో ఓట‌మి కార‌ణంగా ఇక్క‌డ గెలిచి టీడీపీని బ‌తికించుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌నేది న‌ర్మ‌గ‌ర్భ వాస్త‌వం. ఈ క్ర‌మంలోనే ప్ర‌భుత్వాన్ని భారీ ఎత్తున టార్గెట్ చేస్తున్నారు. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌పైనా, ఆయ‌న పాల‌న‌పైనా.. కుటుంబంపైనా విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

ఇక‌, చంద్ర‌బాబు త‌న‌యుడు, మాజీ మంత్రి లోకేష్ కూడా ప్ర‌భుత్వాన్ని టార్గెట్ చేస్తూ.. ఎండ‌కూడా లెక్క చేయ‌కుండా ప్ర‌చారం చేస్తున్నారు. దీనికి ప్ర‌ధానంగా ఒక కార‌ణం క‌నిపిస్తోంది. జ‌గ‌న్ ఐదు ల‌క్ష‌ల మెజారి టీ సాధించాల‌ని త‌న పార్టీ మంత్రుల‌కు, నేత‌ల‌కు టార్గెట్ విధించారు. దీనిని ల‌క్ష‌కు త‌గ్గించ‌డ‌మే ధ్యే యంగా చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇదే జ‌రిగితే.. టీడీపీ అనుకూల మీడియా పెద్ద ఎత్తున చ‌ర్చ‌లు పెట్టి.. అధికార పార్టీ ముఖ్యంగా సీఎం జ‌గ‌న్‌.. నైతికంగా ఓడిపోయార‌నే ప్ర‌చారం చేసేందుకు రెడీ అవుతున్నాయి. ఆ ల‌క్ష కూడా కేవ‌లం వ‌లంటీర్ల కార‌ణంగానే వ‌చ్చింద‌ని చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు.

అయితే.. ఇక్క‌డ ఒక ప్ర‌శ్న ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌స్తోంది. వైసీపీ నేత‌లు, ప్ర‌భుత్వంపై కామెంట్లు చేస్తున్న టీడీపీ అధినేత ఏకంగా వైఎస్ వివేకా హ‌త్య కేసును కూడా వాడుకుంటున్నారు. అయితే.. అదేసమ‌యంలో ప్ర‌త్యేక హోదాకు మంగ‌ళం పాడిన బీజేపీపైకానీ, త‌న పార్టీ నుంచి జంప్ చేసి బీజేపీలో చేరిపోయిన రాజ్య‌స‌భ స‌భ్యుల‌పై కానీ.. ఒక్క మాట కూడా అన‌డం లేదు. దీనిని రాజ‌కీయ విశ్లేష‌కులు.. సీరియ‌స్‌గానే భావిస్తున్నారు. `మ‌నం మ‌నం ఒక‌టి.. ` అనే ధోర‌ణిలో వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని అంటున్నారు.  

వాస్త‌వానికి తిరుప‌తి సాక్షిగా 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో అప్ప‌టి ప్ర‌ధాని అభ్య‌ర్థి న‌రేంద్ర మోడీ హోదాపై హామీ ఇచ్చారు. ఇప్పుడు దానిని న‌చంద్ర‌బాబు మ‌రిచిపోయార‌నే వాద‌న వినిపిస్తోంది. క‌నీసం ఒక్క మాట కూడా మోడీని అన‌డం లేదు. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి బీజేపీతోను, జ‌న‌సేన‌తోనూటీడీపీ జోడీ క‌ట్టాల‌ని చంద్ర‌బాబు త‌హ‌త‌హ లాడుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయా పార్టీల‌పైనా.. ఆయా నేత‌ల‌పై కానీ ఒక్క మాట కూడా అన‌డం లేదని అంటున్నారు. మ‌రి రాబోయే రోజుల‌లో ఏం జ‌రుగుతుందో చూడాలి.  ఇప్ప‌టికే వ‌కీల్ సాబ్ సినిమాను అడ్డు పెట్టుకుని ప‌వ‌న్‌ను దువ్వే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని.. చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లు వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News