కొద్దిరోజులుగా టీవీ-9 న్యూస్ చానల్ విషయంలో జరుగుతున్న పరిణామాలు సంచలనం అవుతున్నాయి. ఈ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూ వస్తోంది. తాజాగా అసోసియేటెడ్ బ్రాడ్ కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (ఏబీసీపీఎల్)లో 90.54 శాతం వాటాను కొనుగోలు చేసిన అలంద మీడియా, ఎంటర్ టైన్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు రవి ప్రకాశ్ ను సీఈవో పదవి నుంచి తొలగించాయి. అంతేకాదు, ఆ చానల్ కు కొత్తగా సీఈవో, సీవోవోలను కూడా నియమించారు. కానీ, రవి ప్రకాశ్ మాత్రం ఎవరినీ వదలను అంటున్నారు. మరోవైపు, తమ సంతకాలు ఫోర్జరీ అవడంతో పాటు, నిధుల దారిమళ్లింపు, అలాగే టీవీ-9 కార్యాలయంలో డేటా చోరీకి గురైందని అలంద మీడియా పోలీసులకు మరోసారి ఫిర్యాదు చేసింది. దీంతో ఇది ఇప్పట్లో తెరపడేలా కనిపించడం లేదు.
టీవీ-9 వ్యవహారం ఇలా నడుస్తుండగా.. మరో చానల్ V6కు సంబంధించిన ఓ వార్త తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపుతోంది. ఆ చానల్ లో పని చేస్తున్న బిత్తిరి సత్తి అలియాస్ చేవెళ్ల రవి రాజీనామా చేస్తున్నారనేదే ఆ వార్త సారాంశం. ఆ చానల్ యాజమాన్యం నుంచి ఎటువంటి ఇబ్బంది లేకపోయినా.. అందులో పని చేస్తున్న కొందరు వ్యక్తుల వల్ల బిత్తిరి సత్తి ఈ నిర్ణయం తీసుకున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, V6 చైర్మన్ వివేక్ సహా పలువురు ముఖ్యులు బిత్తిరి సత్తిని సముదాయించే ప్రయత్నం చేశారని, అయినా ఆయన మాత్రం తన నిర్ణయం మీదే ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. రెండు రోజులుగా ఆయనకు సంబంధించిన కార్యక్రమాలు సదరు చానల్‌లో ప్రసారం కాకపోవడం దీనికి బలం చేకూరుతోంది.
దీంతో మిగతా చానల్స్ వారు బిత్తిరి సత్తి తమ సంస్థలో చేరితే బాగుండు అని కూడా అనుకున్నారట. మరికొందరైతే - సినిమాల్లో బిజీ అయిపోయాడేమో అందుకే చానల్ లో మానేస్తున్నాడు అని కామెంట్లు చేస్తున్నారట. సత్తి అభిమానులు మాత్రం ఈ వార్తతో బాధలో మునిగిపోయారు. ఇంతలోనే ఈ వ్యవహారంపై క్లారిటీ వచ్చేసింది. వాస్తవానికి బిత్తిరి సత్తి తండ్రి చనిపోవడంతో ఆయన అక్కడికి వెళ్లారట. అందుకోసమే రెండు రోజులుగా సత్తికి సంబంధించిన కార్యక్రమాలు ప్రసారం కావడం లేదని తెలిసింది. త్వరలోనే సత్తి హైదరాబాద్ రానున్నారని, ఆ తర్వాత యథావిధిగా తన కార్యక్రమాలు చేస్తారని విశ్వసనీయంగా తెలుస్తోంది. ఈ ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో సత్తి దీనిపై క్లారిటీ ఇచ్చేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.
ఇదిలాఉండగా, V6 చానల్లో ప్రసారం అవుతున్న తీన్మార్ అనే కార్యక్రమం ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే. దీనికి కారణం బిత్తిరి సత్తి అని కూడా విధితమే. కేవలం ఈ ఒక్క ప్రోగ్రామ్ ద్వారా V6 చానల్ రేటింగ్ ఎంతలా పెరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యూట్యూబ్ లో సైతం బిత్తిరి సత్తి వీడియోలకు చాలా క్లిక్స్ వస్తుంటాయి. వాస్తవానికి బిత్తిరి సత్తి అలియాస్ రవి ఓ ప్రముఖ చానల్ లో ప్రసారమైన ‘కామెడీ క్లబ్’ అనే రియాలిటీ షో ద్వారా బుల్లితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత జర్నలిజం వైపు వచ్చారు. ఇందుకోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు. దీని అనంతరం పలు చానల్స్‌లో పని చేసి - 2015లో V6 లో చేరారు. దీని ద్వారా వచ్చిన పాపులారిటీతో పలు సినిమాలు - వెబ్ సిరీస్ లు - ఈవెంట్లను చేస్తూ బిజీ జీవితం గడుపుతున్నారు.