యూపీలో దూసుకుపోతున్న సీఎం యోగి ఆదిత్యనాత్ సొంత నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. అయితే.. యోగి పుణ్యమా అని రెండు దశాబ్దాలుగా బీజేపీకి కంచుకోటగా ఉన్న ఆ గోరక్ పూర్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ కూటమి గెలిచింది. అంత పట్టున్న నియోజకవర్గంలో బీజేపీ ఓటమికి అనేక కారణాలు వినిపిస్తున్నా గత ఏడాది చివర్లో జరిగిన ఓ సంఘటన ప్రధాన కారణమని తెలుస్తోంది. ఫరూకాబాద్ ఆసుపత్రిలో చిన్నారులు మరణంచిన ఘటనే బీజేపీని దెబ్బతీసిందని తెలుస్తోంది.
ఫరూకాబాద్ గోరఖ్ పూర్ నియోజకవర్గంలో ఉంది. అక్కడి రామ్ మనోహర్ లోహియా చిన్నపిల్లల ఆస్పత్రిలో గత ఏడాది ఆక్సిజన్ అందకపోవడంతో 49మంది చిన్నారులు మరణించారు. అప్పట్లో చిన్నారుల మరణం దేశవ్యాప్తంగా షాకింగ్ న్యూస్ గా మారింది. దీంతో చిన్నారుల మృతి ఘటనకు బాధ్యులంటూ ఫరూకాబాద్ ఆస్పత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ తోపాటు సూపరింటెండెంట్ పై యూపీ ప్రభుత్వం కేసు నమోదు చేసింది. జిల్లా కలెక్టర్ ను బదిలీ చేసింది. అయితే.. యోగి ప్రభుత్వంపై ఆ మచ్చ అలాగే ఉండిపోయింది. ఫలితేమే ఈ ఓటమి.
మరోవైపు కొత్తగా జట్టు కట్టిన బీఎస్పీ, ఎస్పీలు అ మరణాలకు కారణం ప్రభుత్వ వైఫల్యమేనని భారీగా ప్రచారం చేయడంతో బీజేపీ దెబ్బతింది. అయితే.. యోగి మాత్రం ఈ ఓటమికి తమ నిర్లక్షమే కారణమంటున్నారు. ఎస్పీ-బీఎస్పీ పొత్తును తక్కువ అంచనా వేసి నష్టపోయామని ఆయన అన్నారు.