కృష్ణా పుష్కరాలు అంటే భక్తుల్లో ఎంత సందడి ఉంటుందో...రాజకీయ వర్గాల్లో అంతే సందడి ఉంటోంది. ముఖ్యంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు టార్గెట్‌గా ఇది తారాస్థాయికి చేరుతోంది. గోదావరి పుష్కరాల సందర్భంగా చంద్రబాబు స్నానం ఆచరించడం వల్ల దాదాపుగా 20 మంది భక్తులు మరణించారని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇపుడు కృష్ణా పుష్కరాల సమయంలో ఏకంగా బాబు పదవి పోవడం అనే పాయింట్ ఆధారంగా చర్చ నడుస్తోంది. అది కూడా నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కేంద్రంగా కావడం విశేషం.
కృష్ణా పుష్కరాలకు ఆంధ్రప్రదేశ్‌లోని ఘాట్‌లన్నింటిలో ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో ఆయా ఘాట్ల సమీపంలో ఉన్న దేవాలయాల ప్రత్యేకత చర్చకు వస్తోంది. అమరావతిలోని అమరేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించిన రాజకీయ ప్రముఖులకు పదవి పోయిన ఉదంతాలు ఉన్న నేపథ్యంలో ఈ గుడిపై ఫోకస్ ఎక్కువగా పడింది తద్వారా చంద్రబాబు ఇక్కడికి రానుండటంపై ఆసక్తి నెలకొంది. పుష్కరాలు, వివిధ పర్యటనల సందర్భంగా గతంలో మాజీ రాష్ట్రపతి జ్ఞానీ జైల్ సింగ్, మాజీ సీఎంలు మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జన్ధారన్‌రెడ్డి అమరావతికి వచ్చారు. అయితే ఈ దేవాలయం దర్శనం అనంతరం వారు పదవి కోల్పోయారనే ప్రచారం ఉంది. ఇదిలాఉండగా 2004లో కృష్ణా పుష్కరాలు, 2006లో బౌద్ధ ఆచారం ప్రకారం నిర్వహించిన కాలచక్ర మహాసభల సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆర్థిక మంత్రి కే రోశయ్య అమరావతికి వచ్చారు. అయితే కేవలం పుష్కర ఘాట్ సందర్శించి వెళ్లారు. 2006లో కాలచక్ర మహాసభలో పాల్గొన్నారు. పలుమార్లు అమరావతిలో వేర్వేరు కార్యక్రమాల్లో పాల్గొన్నా ఆలయానికి మాత్రం వెళ్లలేదు. ఇదిలాఉండగా వైఎస్ తరువాతి ముఖ్యమంత్రులు అయిన రోశయ్య, కిరణ్ కుమార్‌రెడ్డిలు వివిధ పర్యటనల సందర్భంగా అమరావతి ప్రాంతానికి వచ్చినా దేవాలయాన్ని సందర్శించుకోలేదు. దీంతో ప్రస్తుతం చంద్రబాబు ఏం చేయనున్నారనే చర్చ జరుగుతోంది.
ఈ నేపథ్యంలో తాజాగా జరుగుతున్న పుష్కరాల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పుష్కరఘాట్‌కు వెళతారా అనే విషయంలో సందిగ్దత నెలకొంది. అమరావతికి వస్తే ఘాట్లు మాత్రమే సందర్శించి వెళతారని కొందరు అంటుండగా...దేవాలయానికి కూడా సందర్శించుకుంటారని మరికొందరు పేర్కొంటున్నారు. మొత్తంగా ఇపుడు చంద్రబాబు సెంటిమెంటుకు విలువ ఇవ్వనున్నారా? లేదా పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు దేవాలయానికి కూడా వెళ్తారా అనే విషయంలో ఉత్కంఠ నెలకొంది.