కరోనా వేళ కొత్త కష్టాలకు తెర లేస్తోంది. సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలు.. జలుబు.. దగ్గు.. జ్వరం లాంటివి కామన్ గా వస్తుంటాయి. ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా లక్షణాల్లో ఇది కూడా ఒకటి కావటంతో.. ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. ఆసుపత్రికి వెళ్లి.. జ్వరంగా ఉంది కాస్త చూడాలన్నంతనే.. ముందు వెళ్లి కోవిడ్ టెస్టు చేయించుకొని ఫలితం వచ్చిన తర్వాతే మందులిస్తామనే పరిస్థితి.
మరోవైపు సీజనల్ జ్వరాల తీవ్రత పెరిగిపోతున్న వేళ.. తెలంగాణలోని చాలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరత తీవ్రంగా వేధిస్తోంది.ఈ నేపథ్యంలో మరిన్ని చర్యల దిశగా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అలెర్టు అయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ఆసుపత్రుల్లో 54 రకాల మందుల్ని సరఫరాతో పాటు.. జ్వరానికి ఉపయోగపడే డోలోను భారీ ఎత్తున కొనుగోలు చేశారు. మిగిలిన మందుల సంగతి ఎలా ఉన్నా.. జలుబు.. దగ్గు.. ఇతరత్రా లక్షణాలున్న వారికి ఉపయోగపడే మందుల్ని పెద్ద ఎత్తున సమీకరించారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో జ్వరం వస్తే చాలు కరోనా అని తెగ కంగారుపడేవాళ్లు చాలామంది ఉన్నారు. అంతే కాదు.. వైరస్ ఇన్ ఫెక్షన్ గా రూపాంతరం చెందకుండా ఉండేందుకు వీలుగా తక్షణమే యాంటీబయోటిక్స్ అవసరం ఉంది. కరోనా పరీక్షచేసుకొని.. దాని రిజల్ట్ వచ్చేసరికి ఆలస్యం కాకుండా ఉండేందుకు అజిత్రోమైసిన్.. యాంటిబయాటిక్ తో సహా డోలో.. మల్టీ విటిన్.. సీ విటమిన్ మాత్రల్ని ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో డోలో అవసరం భారీగా పెరిగింది. దీంతో.. తాజాగా ఐదు కోట్ల డోలో మాత్రల్ని తెలంగాణ ప్రభుత్వం సేకరించి.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని దవాఖానాలకు పంపింది.