ఆసక్తికర అధ్యయన రిపోర్ట్ బయటకు వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా మనిషి బతికే కాలం మీద పెద్ద ఎత్తున అధ్యనం చేసి.. కొత్త విషయాల్ని వెలుగులోకి తెచ్చారు. ఏ విషయంలో అయినా మగాడే మొనగాడు.. ఆడోళ్లది ఏముందని చెప్పే వారికి తాజా అధ్యయన రిపోర్ట్ షాక్ ఇవ్వటం ఖాయం. ఎందుకంటే.. ప్రపంచ వ్యాప్తంగా మగాళ్లతో పోలిస్తే.. ఆడోళ్లే ఎక్కువ అయుర్దాయంతో బతుకుతున్న నిజం బయటకు వచ్చింది.
ప్రపంచంలోని అన్ని దేశాల్ని కలుపుకొని చూసినప్పుడు మగవారి కంటే మహిళలు ఎక్కువ కాలం జీవిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య గణాంకాల నివేదిక వెల్లడించింది. ప్రపంచంలో యావరేజ్ గా మహిళలు 74.2 ఏళ్లు జీవిస్తుంటే.. మగాళ్లు మాత్రం 69.8 ఏళ్లకే బాల్చీ తన్నేస్తున్నారట. మగాళ్ల కంటే ఆడోళ్లు అదనంగా బతుకుతున్న 4.4 ఏళ్లల్లోనూ వారికి కష్టాలు తప్పటం లేదు. ఇలా వారు అదనంగా బతికే కాలం ఒంటరితనంతోనో.. పేదరికంలోనో మగ్గాల్సి వస్తోందని చెబుతున్నారు.
ప్రపంచ సరాసరి ఇలా ఉంటే భారత్ విషయానికి వస్తే మగాళ్ల జీవిత కాలం 67.4 సంవత్సరాలు అయితే భారత మహిళ అయుర్దాదం 70.3 ఏళ్లు. అంటే.. ప్రపంచ సరాసరి కంటే దేశ ప్రజల ఆయుర్దాం తక్కువగా ఉండటం గమనార్హం. ప్రపంచంలో అత్యధికంగా బతుకున్నది జపనీయులుగా తేల్చారు. అక్కడ మహిళలు అత్యధికంగా 87.1 ఏళ్లు బతుకుతుంటే.. మగాళ్లు 81.1 ఏళ్లు జీవిస్తున్నారు.
మగాళ్ల కంటే మహిళలు ఎక్కువకాలం ఎందుకు జీవిస్తున్నారు? దానికి కారణం ఏమిటి? అన్న విషయంలోకి వెళితే.. అందుకు ఒకట్రెండు కారణాలు కావు.. ఏకంగా 40 కారణాలు ఉన్నట్లు తేల్చారు. వీటిల్లో 33 కారణాలు ఎక్కువ కాలం బతకటానికి పెద్ద ఎత్తున దోహదం చేస్తున్నట్లుగా తేల్చారు. మగాళ్ల జీవితకాలం తక్కువగా ఉండటానికి గుండెపోటు.. ఊపిరితిత్తుల కేన్సర్.. టీబీ.. రోడ్డు ప్రమాదాలు కారణాలుగా తేల్చారు.
ఆర్థికంగా పేద దేశాల్లోని ప్రజలు తక్కువ కాలం బతుకుతుంటే.. ధనిక దేశాల్లోని ప్రజలు ఎక్కువ కాలం బతుకుతున్నట్లుగా తేల్చారు. ధనిక దేశాలతో పోలిస్తే పేద దేశాల్లో మరణాలు తొందరగా రావటానికి కారణం వ్యాధులు.. ఆరోగ్య సమస్యలుగా చెప్పక తప్పదు. మరో ఆసక్తికరమైన అంశం ఏమంటే.. పట్టణాలు.. నగరాల్లో జీవిస్తున్న ప్రజల్లో ప్రతి పది మందిలో ఒకరు కాలుష్యం కారణంగా మరణిస్తున్నట్లుగా తేల్చారు. కాలుష్యం కారణంగా గుండె జబ్బులు.. ఊపిరితిత్తుల కేన్సర్.. ఇతరశ్వాసకోశ వ్యాధులకు అవకాశం చాలా ఎక్కువగా ఉన్నట్లు ఈ అధ్యయన రిపోర్ట్ స్పష్టం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా వాయుకాలుష్యం కారణంగా 2016 ఒక్క సంవత్సరంలో చనిపోయిన వారి సంఖ్య అక్షరాల 70లక్షలు కావటం విశేషం. వాయుకాలుష్యాన్నిచాలామంది లైట్ గా తీసుకుంటారు కానీ.. దాని కారణంగా మనిషికి ముంచుకొచ్చే డేంజర్ చాలా ఎక్కువన్న విషయాన్ని అస్సలు మర్చిపోకూడదు.