రష్యాకు వెళ్లనున్న భారత నిఘా, దర్యాప్తు బృందాలు

Update: 2022-08-24 02:30 GMT
భారత అగ్రగామి రాజకీయ నేతల్లో ఒకరిపై ఆత్మాహుతి దాడికి కుట్ర పన్ని రష్యాలో పట్టుబడిన ఐసిస్ ఉగ్రవాదిని విచారించేందుకు భారత నిఘా, దర్యాప్తు సంస్థలు సిద్ధమవుతున్నాయి. ఎన్.ఐఏ, ఇంటెలిజెన్స్ బ్యూరో బృందాలు రష్యాకు వెళ్లనున్నట్లు తెలిసింది.  ఈ బృందాలు అక్కడ ఫెడరల్ సెక్యూరిటీ ఏజెన్సీ, ఇతర దర్యాప్తు సంస్థలతో కలిసి వివరాలు సేకరించనున్నాయి. ఆ ఉగ్రవాదికి భారత్ లో ఉన్న సంబందాలపై మన దర్యాప్తు బృందాలు దృష్టి పెట్టే అవకాశం ఉన్నట్టు తెలిసింది.

భారత్ లోని అగ్ర రాజకీయ నేత హత్యకు ఐసిస్ కుట్ర పన్నింది. ఏకంగా ఆత్మాహుతి దాడి చేసేందుకు స్కెచ్ గీసింది. ఈ కుట్రను రష్యా భగ్నం చేసింది.  ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాద సంస్థకు చెందిన ఆత్మాహుతి బాంబర్ ను తమ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ (ఎఫ్ఎస్.బీ) సోమవారం తెలియజేసింది. ఉగ్రవాది భారతదేశ నాయకత్వ ప్రముఖులలో ఒకరిపై తీవ్రవాద దాడికి కుట్ర పన్నాడని రష్యా వార్త సంస్థ తెలిపింది.

రష్యా ఎఫ్.ఎస్.బీ రష్యాలో నిషేధించిబడిన ఐసీస్ ఉగ్రవాద సంస్థ సభ్యుడిని గుర్తించి నిర్బంధించింది. అతడు మధ్య ఆసియా ప్రాంతంలోని ఒక దేశానికి చెందినవాడుగా గుర్తించింది. భారతదేశానికి చెందిన అత్యున్నత పాలకవర్గాల ప్రతినిధుల్లో ఒకరిపై ఆత్మాహుతి దాడి చేయడానికి ప్లాన్ చేశాడని రష్యా తెలిపింది.

ఐసిస్ గ్రూపులో అదుపులోకి తీసుకున్న సభ్యుడిని ఐసిస్ నేత ఒకరు టర్కీలో ఆత్మాహుతి బాంబర్ గా చేర్చుకున్నట్లు సమాచారం. చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం కింద కేసులు నమోదు చేసింది. ఐసిస్ తన భావజాలాన్ని ప్రచారం చేయడానికి వివిధ ఇంటర్నెట్ ఆధారిత సోషల్ మీడియా ఫాట్ ఫారమ్ లను సంబంధిత ఏజెన్సీలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. వీటిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.

రష్యా గత ఏడాది తాలిబాన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్ఘనిస్తాన్ లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ సభ్యుల సంఖ్య మూడు రెట్లు పెరిగి 6వేలకు చేరిందని రష్యా అంతకుముందు తెలిపింది.ఇక పట్టుబడ్డ ఐసిస్ ఉగ్రవాది భారత్ లోని మోడీ, అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ లపై టాప్ 3పై ఆత్మాహుతి దాడికి ప్రయత్నించారని విచారణలో తేలింది.  ఈ మేరకు కుట్ర చేశారని రష్యా తెలిపింది.

ఈ మేరకు ఆ ఐసిస్ ఉగ్రవాదిని విచారించి కుట్ర కోణాలు తెలుసుకునేందుకు రష్యాకు భారత బృందాలు వెళ్లడానికి సిద్ధమయ్యాయి.
Tags:    

Similar News