ఆనందం ఎక్కడ దొరుకుతుంది? కొందరికి చేసే పనిలో దొరుకుతుంది.. కొందరు మందులో.. విందులో.. పొందులో.. ఇలా రకరకాలుగా దొరుకుతుంది. కానీ అది ఎల్లప్పుడూ సాధ్యం కాదు.. కానీ ప్రపంచంలో కెల్లా అత్యంత ఆనందకరమైన దేశం ఒకటి ఉంది. అది భారత దేశం అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే.. 'ఫిన్లాండ్'. యూరప్ ఖండంలోని ఈ దేశం వరుసగా నాలుగోసారి 'ప్రపంచంలోనే ఆనందకరమైన' దేశంగా అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.
ప్రపంచం మొత్తం కరోనాతో అతాలకుతలమై చావులు, ఉద్యోగాలు కోల్పోయి.. సంపద లేక అష్టకష్టాలు పడుతున్న వేళ కూడా ఈ దేశం మాత్రం అత్యంత ఆనందాలతో విలసిల్లడం విశేషంగా చెప్పొచ్చు. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి రిపోర్టు విడుదల చేసింది.
దాదాపు ప్రపంచంలోని 149 దేశాలపై సర్వే చేశారు. దేశ ప్రజలను అడిగి మరీ ఈ డేటా తయారు చేశారు. అన్ని దేశాల్లోని ప్రజలు ఎంత ఆనందంగా ఉన్నారో పరిశీలించారు. ప్రతి దేశంలోని దేశంలోని జీడీపీ, సామాజిక మద్దతు, వ్యక్తిగత స్వేచ్ఛ, అవినీతి స్థాయి లాంటి అన్ని అంశాలు పరిగణలోకి తీసుకొని ఈ నివేదిక తయారు చేశారు.
ప్రపంచంలోనే ఆనందంతో ఉన్న దేశంగా ఫిన్లాండ్ ఫస్ట్ ప్లేసులో.. డెన్మార్క్ రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్విట్జర్లాండ్, ఐస్లాండ్, నెదర్లాండ్ వంటి దేశాలు ఉన్నాయి. గత ఏడాదితో పోలిస్తే న్యూజిలాండ్ ఒక స్థానం పడిపోయి తొమ్మిదో స్థానంలో నిలిచింది. అమెరికా 19వ స్థానాన్ని పరిమితమైంది. ఆఫ్రికా దేశాలు లెసోతో, బోట్సవానా, రువాండ, జింబాబ్వే చివరి స్థానంలో నిలిచాయి. భారత దేశం 139వ స్థానంలో నిలిచి ఎక్కడో ఉంది. ఫిన్లాండ్ లో విద్య, భద్రత, ఒత్తిడి లేని జీవితాలే ఆ దేశాన్ని నంబర్ 1 పొజిషన్ లో నిలిపాయి