క్రిప్టో కరెన్సీ విలువ దారుణంగా పడిపోయింది. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ క్రిప్టో కరెన్సీపై సంచలన వ్యాఖ్యలు చేయడం, చైనా కూడా క్రిప్టో కరెన్సీ బ్యాంకింగ్ సేవలను నిలిపివేయడమే ఇందుకు కారణమని ఆర్థికవేత్తలు అంటున్నారు. గత నెలలో ఏకంగా 64 వేల డాలర్లు పైకి వెళ్లిన క్రిప్టో కరెన్సీ ఈ సారి ఏకంగా 37 వేల డాలర్లకు పతనం అయ్యింది. బిట్ కాయిన్ దాదాపు సగం పడిపోయిందని ఆర్థిక వేత్తలు అంటున్నారు. మిగిలిన క్రిప్టోకరెన్సీలకు కూడా విలువ తగ్గుతున్నట్టు సమాచారం.
బిట్‌కాయిన్ కు ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎంతో విలువ ఉండేది. బంగారంతో సమానంగా దీనిపై ముదుపర్లు పెట్టుబడులు పెట్టేవారు. కానీ ఇప్పుడు ఒక్కసారిగా విలువ పడిపోయింది. ఇప్పుడు దీని విలువ 65వేల డాలర్ల నుండి 37వేల డాలర్లకు పడిపోయింది. బిట్ కాయిన్ గడిచిన 24 గంటల్లో దారుణంగా పతనం అయ్యింది. దాదాపు 35 శాతం విలువ పడిపోయి 30,000 డాలర్లకు చేరింది. గత 14 నెలల్లో ఇదే కనిష్టమని ఆర్థికనిపుణులు అంటున్నారు.
చైనా ఎఫెక్ట్..!
క్రిప్టో కరెన్సీ విలువ తగ్గిపోవడానికి ప్రధాన కారణం చైనా అని అంటున్నారు ఆర్థికవేత్తలు. ఎందుకంటే క్రిప్టో కరెన్సీకి సబంధించిన సేవలను చైనా బ్యాంకులు, పేమెంట్ కంపెనీలు నిషేధించాయి. దీంతో దాని విలువ అమాంతం పడిపోయింది. క్రిప్టో కరెన్సీపై మొదటి నుంచి ఆరోపణలు ఉన్నాయి. అది అసలు కరెన్సీ కాదని అమెరికా ఆర్థికవేత్తలు గతంలోనే పలుమార్లు హెచ్చరించారు. తాజాగా క్రిప్టోకరెన్సీ ఇన్వెస్టర్ల సంపద ఏకంగా 600 బిలియన్ డాలర్ల మేర పడిపోయింది.