దేశ ప్రధాని నరేంద్ర మోడీ నోరు విప్పితే వచ్చే మాటలు.. ఆయన నోటి నుంచి చెప్పే విలువలు.. ఆదర్శాలు వింటే మైమరిచిపోయేలా ఉంటాయి. విశ్వగురుగా కీర్తిని అందుకునే ఆయన.. ప్రభుత్వాన్ని నడిపే విషయంలోనూ..
ప్రభుత్వానికి ఆస్తులుగా ఉన్న వాటిని అమ్మేసే విషయంలో తీసుకునే నిర్ణయాల్ని చూస్తే.. ఇలా ఎందుకు చేయాలంటారు? అన్న ప్రశ్న తలెత్తక మానదు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంచటంలో మోడీ చేసిన ప్రయత్నాలు అన్ని ఇన్ని కావంటూ ఆయన్ను గట్టిగా మద్దతు పలికే బ్యాచ్ఒకటి గొప్పలు చెబుతూ ఉంటుంది.
ఈ గొప్పల మాట ఎలా ఉన్నా.. చాలా చిన్న మొత్తాల కోసం ప్రభుత్వం తన ఆస్తుల్ని అమ్మేస్తున్న తీరు ఆందోళన కలిగించక మానదు. ఈ ఏడాది పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.65 వేల కోట్లును సమకూర్చుకోవాలని కేంద్రం నిర్ణయించింది. సాధారణంగా సరైన ప్రభుత్వం ఏదైనా ప్రభుత్వ ఆస్తుల్ని అంతకంతకూ పెంచే ప్రయత్నం చేస్తుంటుంది. కానీ.. మోడీ సర్కారు మాత్రం ఎప్పటి నుంచో ఉన్న ఆస్తుల్ని సైతం అమ్మకాలతో కరిగించేస్తుంది.
తాజాగా అలా అమ్మేసుకోవటంలో భాగంగా యాక్సిస్ బ్యాంకకు సంబంధించి కేంద్రానికి ఉన్న 1.55 శాతం వాటాను తాజాగా అమ్మేసింది. ఈ వాటాకు సరి సమానమైన 4.65 కోట్ల షేర్లను అమ్మేసింది. దీంతో.. ప్రభుత్వానికి రూ.3839కోట్లు సమకూరినట్లైంది. తాజా పరిణామంతో యాక్సిస్ బ్యాంక్ నుంచి కేంద్రం పూర్తిగా వైదొలిగినట్లైంది. ఈ బ్యాంకులో ఒక్కో ఈక్విటీ షేరుకు రూ.830.63 చొప్పున మొత్తం రూ.3839 కోట్ల మొత్తం వచ్చింది.
కేంద్రం బడ్జెట్.. దానికి వచ్చే ఆదాయంతో పోలిస్తే ఈ మొత్తం పెద్దదేం కాదు. కానీ.. ఆ మాత్రం దానికే తన వద్ద ఉన్న షేర్లను అమ్ముకోవాల్సిన అవసరం ఏమిటి? అన్నది ప్రశ్న. దేశ ఆర్థిక పరిస్థితిని మోడీ
సర్కారు చక్కదిద్దింది వాస్తవమే అయినప్పుడు.. రూ.3839 కోట్ల మొత్తం కోసం బ్యాంకులో తనకున్న వాటాను అమ్మాల్సిన అవసరం ఏమిటి మోడీ మాస్టారు? అని అడకుండా ఉండలేం. మరి.. ఈ ప్రశ్నకు మోడీ సర్కారు ఇచ్చే సమాధానం ఏమిటి?
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.