మెగా నిర్మాత అల్లు అరవింద్.. అహా ఓటీటీ ప్లాట్‌ఫామ్ ప్రారంభించిన అతి స్వల్ప కాలంలోనే మెగా సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణతో అన్ స్టాపబుల్ షో ప్రారంభించాక అహా ఓటీటీ అందరికీ చేరువైపోయింది. అగ్ర హీరోల్లో ఒకరిగా ఉన్న బాలయ్య తొలిసారిగా ఒక టాక్ షోకి హోస్టుగా వ్యవహరించడం.. బాలయ్య ఆ టాక్ షోను నడిపిస్తున్న విధానంతో అన్ స్టాపబుల్ పేరుకు తగ్గట్టే దూసుకుపోతోంది.
ఈ నేపథ్యంలో ఈ టాక్ షో రాజకీయపరంగానూ తీవ్ర సంచలనాలకు, విమర్శలకు కారణమవుతోంది. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్ లతో నిర్వహించిన అన్ స్టాపబుల్ అధికార వైసీపీ, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీసిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ను ఏ పరిస్థితుల్లో పదవి నుంచి దింపాల్సి వచ్చిందో.. అప్పుడు ఏం జరిగిందో ఈ షోలో చంద్రబాబు వివరించారు.
దీంతో వైసీపీ ఈ టాక్ షో ద్వారా చంద్రబాబు ఉత్తముడిని చూపించడానికి బాలయ్య, చంద్రబాబు ప్రయత్నించారని విమర్శలు చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు హై వోల్టేజ్ టాక్ షో బాలయ్య చేయనున్నారు. ఎందుకంటే ఈసారి గెస్టుగా వస్తున్న అతిథి మరెవరో కాదు.. జనసేనాని పవన్ కల్యాణ్ కావడమే సర్వత్రా చర్చకు, వైసీపీ నేతల విమర్శలకు కారణమవుతోంది.
దీంతో వైసీపీ నేతలు ఉలిక్కిపడుతున్నారు. పవన్ కల్యాణ్ పై విమర్శలు చేసే వైసీపీ కాపు నేతలు పేర్ని నాని, అంబటి రాంబాబు మరోమారు పవన్ పై తీవ్ర విమర్శలకు దిగారు. చిరంజీవి.. మీలో ఎవరు కోటీశ్వరుడు షో నిర్వహిస్తే పవన్ కల్యాణ్ దానికి రాలేదని.. బాలయ్య నిర్వహిస్తున్న టాక్ షోకి మాత్రం వస్తున్నారని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. పవన్ ప్యాకేజీ స్టార్ అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు అంబటి రాంబాబు ట్వీట్ చేశారు.
ఇక పవన్ కల్యాణ్ పై ఓ రేంజులో విరుచుకుపడే పేర్ని నాని సైతం మరోసారి తీవ్ర విమర్శలకు దిగారు. ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బాలయ్య దీన్ని రాజకీయాలకు వాడుకుంటున్నారని పేర్ని నాని అంటున్నారు. గతంలో చంద్రబాబును ఇంటర్వ్యూ చేసి.. ఎన్టీఆర్ వెన్నుపోటు వ్యవహారాన్ని వారికి అనుకూలంగా మార్చిచెప్పుకున్నారని.. తద్వారా ప్రజలను నమ్మించాలని చూశారని పేర్ని నాని గుర్తు చేశారు.
ఇప్పుడు పవన్ కల్యాణ్ తో టాక్ షో ద్వారా పవన్ తప్పులను కప్పిపుచ్చేలాగా ఇంటర్వ్యూ చేయనున్నారని పేర్ని ఆరోపణలు చేస్తున్నారు. బాలయ్య, చంద్రబాబు ఇద్దరితోనూ పవన్ కల్యాణ్ కలసి తిరుగుతున్నారంటూ విమర్శలు చేశారు. అయితే వీళ్లిద్దరి 'షో' మాత్రమేనని.. అంతకుమించి ఇంకేం ఉండబోదని పేర్ని నాని అంటున్నారు.
కాగా ఒక సాధారణ టాక్ షోగా మొదలైన అన్ స్టాపబుల్ షో జరిగే కొద్దీ రాజకీయంగా అనేక సంచలనాలకు దారితీస్తోంది. దీంతో వైసీపీ నేతలు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ షో వల్ల తమకు నష్టం జరుగుతుందని అంతర్గతంగా వారు భయపడుతున్నారని చెబుతున్నారు. అందుకే ఆ షోపైన విమర్శలు చేస్తున్నారని అంటున్నారు. పైకి మాత్రం ఆ షోతో తమకు వచ్చే నష్టం ఏమీ లేదని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని పేర్కొంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లో చీలనివ్వబోనని జనసేనాని పవన్ కల్యాణ్ చెబుతున్న సంగతి తెలిసిందే. ఇందుకు ఏపీలో అన్ని రాజకీయ పక్షాలు కలసి రావాలని, త్యాగాలకు సిద్ధం కావాలని పవన్ ఇప్పటికే పలుమార్లు పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడం లేదని పవన్ కుండబద్దలు కొడుతున్నారు.
ఈ నేపథ్యంలో జనసేన–టీడీపీ కలిసి పోటీ చేస్తే 2014 ఫలితాలు ఖాయమనే భావనలో సాధారణ ప్రజలు కూడా ఉన్నారన్నది వాస్తవమని అంటున్నారు. అందుకే వైసీపీ నేతలు దమ్ముంటే పవన్ 175 సీట్లలో పోటీ చేయాలని సవాల్ విసురుతున్నారని చెబుతున్నారు. 175 సీట్లలో పోటీ చేయకపోతే పవన్ కల్యాణ్ ప్యాకేజీ స్టార్ అనే విషయాన్ని ఆయన ఒప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
కొద్ది రోజుల క్రితం బాలయ్య కొత్త చిత్రం.. వీరసింహారెడ్డి షూటింగ్ సెట్‌కు పవన్ వెళ్లిన సంగతి తెలిసిందే. బాలయ్య, పవన్ కలసి ఉన్న ఆ ఫొటో తెలుగు సినిమా ఇండస్ట్రీతోపాటు రాజకీయంగానూ సంచలనం రేకెత్తించింది.
ఇప్పుడు పవన్ అన్ స్టాపబుల్ టాక్ షోకి వస్తుండటం ఖాయమని తేలిపోయింది. ఇప్పటికే అహా ఓటీటీ ఇందుకు సంబంధించిన చిత్రాలు, ఒక షార్ట్ వీడియోను కూడా విడుదల చేసింది. పవన్ కు ఎదురెళ్లి బాలయ్య స్వాగతం పలికిన తీరు, పవన్ ను హత్తుకున్న తీరు వైసీపీ నేతలకు మంటెక్కిస్తోందని అంటున్నారు.
ఏపీలో ఇప్పటికే ఏబీఎన్, టీవీ 5 తదితర చానెళ్లను నిషేధించారు. ఆ ప్రసారాలు రాకుండా చేస్తున్నారు. తమకు రాజకీయంగా నష్టం చేస్తున్న ఆహాను అడ్డుకోవడం మాత్రం వైసీపీ తరం కాదని అంటున్నారు. ఎందుకంటే అహా టీవీ చానెల్ కాదు. అది ఓటీటీ ప్లాట్ పామ్ అనే విషయం తెలిసిందే. దీంతో వైసీపీ నేతలు ఈ టాక్ షోపై, పవన్, బాలయ్యలపై తీవ్ర విమర్శలకు దిగుతున్నారని చెబుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.