మంత్రి మల్లారెడ్డి, ఆయన కుమారుడు, అల్లుడికి సంబంధించిన ఇళ్లు, సంస్థలపై సోదాలు జరుగుతున్నాయి. అలాగే కొంపల్లిలోని పామ్ మెడోస్ విల్లాలో సోదాలు నిర్వహిస్తున్నారు. దాదాపు 50 బృందాలు ఈ దాడిలో పాల్గొన్నట్లు సమాచారం. మల్లారెడ్డి యూనివర్సిటీ, కాలేజీల్లో సోదాలు చేస్తున్నారు. మల్లారెడ్డి కుమార్తె, అల్లుడు, కుమారుడి నివాసాలతో పాటు మల్లారెడ్డి సోదరుల ఇళ్లలోనూ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.
కొంపల్లిలోని ఓ విల్లాలో నివాసం ఉంటున్న మంత్రి మల్లారెడ్డి తనయుడు మహేందర్‌రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. బోయిన్‌పల్లి, మేడ్చల్, మల్కాజిగిరిలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. "కేంద్ర సంస్థలు హైదరాబాద్‌కు మొగ్గు చూపుతున్నాయి. ముఖ్యంగా కేసీఆర్ ను టార్గెట్ చేసేందుకు ఈడీ, సీబీఐలు హైదరాబాద్ లో క్యాంపు కార్యాలయాలు తెరిచినట్లే. ఇలాంటి ప్రతీకార రాజకీయాలను ప్రజలు సహించరని' టీఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారు. మరి ఇవి ఎటువైపు దారితీస్తాయన్నది వేచిచూడాలి.
తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ దాడులు కలకలం రేపాయి. ముమ్మరంగా కొనసాగుతున్నాయి. తాజాగా ఆయన కోడలు ప్రీతిరెడ్డిని ఐటీ అధికారులు మల్లారెడ్డి ఇంటికి పిలిపించారు. ఆమె ఒక బ్యాగ్ పట్టుకొని ఇంట్లోకి వెళ్లడం చర్చనీయాంశమైంది. అందులో డబ్బుందా? లేక ఏమైనా పత్రాలు ఉన్నాయా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. కాగా మల్లారెడ్డికి చెందిన మెడికల్ కాలేజీల వ్యవహారాలన్నీ ప్రీతిరెడ్డియే చూస్తున్నారు.
కాగా ఐటీ దాడుల నేపథ్యంలో మహేందర్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డిల ఆరోగ్యం నిలకడగా ఉందని ఐటీ అధికారులు తెలిపారు. సోదాలకు సహకరించాలని ఐటీ అధికారులు మంత్రి మల్లారెడ్డిని కోరారు. ఆస్పత్రి నుంచి మంత్రి మల్లారెడ్డిని ఐటీ అధికారులు తీసుకెళ్లారు. మంత్రి మల్లారెడ్డి తనయుడు మహేందర్ రెడ్డి అస్వస్థతకు గురికావడంతో ఆయనను ఇవాళ ఉదయం సూరారంలోని నారాయణ హృదయాలయంలో చేర్పించారు. మహేందర్ రెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించారు.
ఇక మంత్రి మల్లారెడ్డి సమీప బంధువు ప్రవీణ్ రెడ్డికి బీపీ డౌన్ అయ్యింది. ప్రవీణ్ రెడ్డిపై సీఆర్పీఎఫ్ సిబ్బంది దాడి చేశారని మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. ఆస్పత్రి నుంచి మంత్రి మల్లారెడ్డిని ఇంటికి తీసుకెళ్లారు ఐటీ అధికారులు. సోదాలకు సహకరించాలని కోరారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.