జాక్వెలిన్ ను ఎందుకు అరెస్ట్ చేయలేదు.. ఈడీకి కోర్టు సూటి ప్రశ్న

Update: 2022-11-10 10:30 GMT
రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ సులభంగా దేశం దాటగలదని కోర్టు ఈడీ వెల్లడించింది. ఆమెను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. జాక్వెలిన్ బెయిల్ పిటీషన్ పై ఢిల్లీ పటియాలా హౌస్ కోర్టులో విచారణ జరిగింది. ఆమెకు బెయిల్ ను వ్యతిరేకిస్తూ దర్యాప్తు సంస్థలు వాదించారు. ఇప్పటివరకూ ఎందుకు అరెస్ట్ చేయలేదని కోర్టు ప్రశ్నించింది.

ఎల్ఓసీ జారీ చేసినప్పటికీ జాక్వెలిన్ ను ఎందుకు అరెస్ట్ చేయలేదని కోర్టు ప్రశ్నించింది. ఇతర నిందితులు జైల్లో ఉన్నారు.. జాక్వెలిన్ విషయంలో ఎందుకు బెయిల్ కు అంగీకరించారని ఈడీని కోర్టు ప్రశ్నించారు. జాక్వెలిన్ బెయిల్ పిటీషన్ పై రేపు తీర్పును ఇవ్వనుంది.

జాక్వెలిన్ కు ఇప్పటికే కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జాక్వెలిన్ దేశం దాటి వెళ్లేందుకు ప్రయత్నించారని.. ఆమె విచారణకు సహకరించడం లేదని ఈడీ వాదిస్తోంది. ఈ కారణాలతోనే ఆమె బెయిల్ పిటీషన్ ను వ్యతిరేకించింది.

ఈ కేసులో రెగ్యులర్ బెయిల్ కోసం జాక్వెలిన్ ఫెర్నాండెజ్ దరఖాస్తును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వ్యతిరేకించింది. జాక్వెలిన్ తన సెల్ ఫోన్ నుండి డేటాను తొలగించడం ద్వారా విచారణ సమయంలో సాక్ష్యాలను తారుమారు చేసిందని ఈడీ ఆరోపించింది. జాక్వెలిన్ దేశం విడిచి పారిపోవడానికి ప్రయత్నించిందని, అయితే ఆమె పేరు 'లుకౌట్ సర్క్యులర్'లో ఉన్నందున అది చేయలేకపోయిందని ఈడీ ఆరోపించింది, ఇది భారతదేశం నుండి పారిపోవాలనుకునే వ్యక్తుల జాబితాలో జాక్వెలిన్ పేరు ఉండడంతోనే ఆమెకు సాధ్యపడలేదని వివరించింది.

ఈడీ లేవనెత్తిన మరో పాయింట్‌లో ఈ కేసులో ఇతర నిందితులతో ముఖాముఖి కూర్చున్నప్పుడు జాక్వెలిన్ విచారణకు సహకరించలేదని ఆరోపించారు. ఫోర్టిస్ హెల్త్‌కేర్ మాజీ ప్రమోటర్ శివిందర్ మోహన్ సింగ్ భార్య అదితి సింగ్‌తో సహా పలువురిని డబ్బు కోసం మోసం చేసి జైలుకెళ్లిన సుఖేష్ చంద్రశేఖర్ నుంచి జాక్వెలిన్ ,నోరా ఫతేహిలు లగ్జరీ కార్లు మరియు అనేక ఇతర ఖరీదైన బహుమతులు అందుకున్నారని ఈడీ ఇప్పటికే చెప్పిన విషయం తెలిసిందే.

సుకేష్ చంద్రశేఖర్ తన లాయర్ ద్వారా జాక్వెలిన్ తప్పు లేదని ఈడీకి లేఖ పంపారు. ఆ బహుమతులను స్వీకరించడం ఆమె తప్పు కాదని, అలాగే ఆ బహుమతుల కోసం ఖర్చు చేసే ప్రతి పైసా చట్టబద్ధమైన ఆదాయ వనరుల ద్వారా తాను సంపాదించానని సుకేష్ చెప్పాడు. పీఎంఎల్‌ఏ (మనీలాండరింగ్) కేసులో జాక్వెలిన్‌ను నిందితురాలిగా చేర్చడం చాలా చాలా అదృష్టమని సుకేష్ రాశాడు. మేము ఒక సంబంధంలో ఉన్నామని.. నేను ఆమెకు, ఆమె కుటుంబానికి బహుమతులు ఇచ్చినట్లయితే, వారి తప్పు ఏమిటి... ఆమెను ప్రేమించడం .. ఆమెకు అండగా నిలవడం తప్ప ఆమె నన్ను ఎన్నడూ ఏమీ అడగలేదని సుఖేష్ ఈడీకి కోర్టుకు విన్నవించారు.

ఈరోజు బెయిల్ పిటీషన్ సందర్భంగా ప్రశ్నలు సంధించిన కోర్టు రేపు బెయిల్ పిటీషన్ పై తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. దీంతో జాక్వెలిన్ బెయిల్ రద్దు అవుతుందా? లేదా ఇస్తారా? అన్నది ఆసక్తి రేపుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News