ఏపీలో అతితక్కువ సమయంలో అధికారంలోకి వచ్చిన వైసీపీ.. ఒక సంచలనమే సృష్టించిందని చెప్పాలి. పార్టీ పెట్టి 8 ఏళ్లకే అధికారం చేపట్టింది. అది కూడా 151 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుని రికార్డు సృష్టించింది. అలాంటి పార్టీ పురుడు పోసుకుని శనివారం నాటికి పుష్కర కాలం పూర్తయింది. దీంతో.. అధికార పార్టీ ఆవిర్భావ వేడుకలను పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు మంత్రులు కూడా చాలా అట్టహాసంగా చేసుకున్నారు. అయితే.. ఇంత అట్టహాసంగా జరిగినా.. పార్టీ అధినేత జగన్ చేసిన ఒకే ఒక్కతప్పు.. చేయడం గమనార్హం.
జగన్ పెద్ద తప్పు చేశారని, పార్టీ సభ్యుల పట్ల ఆయనకు ఎలాంటి ఆదరణ లేదని.. పెద్ద ఎత్తున వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వైఎస్సార్‌సీపీ 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని శనివారం రాష్ట్రవ్యాప్తంగా పార్టీ జెండాను ఆవిష్కరించి, కేక్‌లు కట్ చేసి, పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. పార్టీ కేంద్ర కార్యాలయంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా తాడేపల్లి సెంట్రల్ కార్యాలయంలో కూడా పార్టీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. విశిష్ట అతిథి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ జెండాను ఎగురవేశారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అయితే.. ఇంత జరిగినా.. సీఎం జగన్ వేడుకల్లో పాల్గొనలేదు. నిజానికి ఈ కార్యక్రమాలు ఇంటా బయటా కూడా అంతా సవ్యంగానే సాగాయి. వారంతా ప్రత్యేక దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు జగన్ ఎందుకు కనిపించడం లేదనే గుస గుస వినిపిస్తోంది.
వైసీపీ ప్రస్తానాన్ని గమనిస్తే.. అనేక అడ్డంకులను అధిగమించి అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో అధికారంలో ఉండగా.. వచ్చిన ఆవిర్భావ దినోత్సవాన్ని సీఎం జగన్ ఎందుకు మిస్ చేసుకున్నారు. ఇలాంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని దాటవేయడంలో జగన్‌కు అంతకంటే ముఖ్యమైనది ఏమిటనేది మేధావుల ప్రశ్న. జగన్ తన విజయాన్ని సొంతంగా జరుపుకోకూడదని ఎందుకు నిర్ణయించుకున్నారనేది కూడా అనేక అనుమానాలకు ఆస్కారం ఇస్తోంది. ఈ రోజు తనకు గౌరవప్రదమైన స్థానం ఇచ్చిన పార్టీ నేతలను, సొంత పార్టీని పట్టించుకోలేదా? అనే సందేహాలు కూడా వస్తున్నాయి.
ఈ విషయంపై ఆరా తీస్తే, జగన్ శనివారం ఖాళీగానే ఉన్నారు. అంతేకాదు.. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన కనీసం 30 నిమిషాలు పార్టీ కోసం గడిపి ఉంటే.. పార్టీ నేతల్లో మరింత ఉత్సాహం ఇనుమడించేది. ఇదిలావుంటే.. ప్రతిపక్ష పార్టీ టీడీపీ ఈ ఏడాది మేలో జరిగే పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తోంది. ఇక, జనసేన అధినేత పవన్ సోమవారం పార్టీ 8వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా చేసేందుకు ప్రత్యేక ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అధికారంలో ఉన్న వైసీపీ అధినేత ఎందుకు.. దీనిని లైట్ తీసుకున్నారనేది ప్రశ్న.
కాగా, మంత్రులు ఆదిమూలపు సురేష్, ధర్మాన కృష్ణదాస్, ఎంపీ మోపిదేవి వెంకట్రమణ, ఎమ్మెల్యేలు మెరుగు నాగార్జున, జోగి రమేష్, అబ్బయ్య చౌదరి, ఎమ్మెల్సీలు డొక్కా మాణిక్య వర ప్రసాద్, గంగుల ప్రభాకర్ రెడ్డి, డీసీ గోవిందారెడ్డి, జంగా కృష్ణమూర్తి, దువ్వాడ శ్రీనివాస్, ఉమ్మారెడ్డి వెంకటేశ్వరులు, లెళ్ల అప్పారావులు, రెడ్డి, పోతుల సునీత, తెలుగు అకాడమీ చైర్‌పర్సన్ లక్ష్మీపార్వతి తదితరులు వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు.