కాలం కలిసిరాకపోతే అన్ని మూసుకొని ఉండడమే ఉత్తమం. ఈ కరోనా టైంలో అందరూ చేస్తున్నది అదే. రాజకీయ ప్రత్యర్థులు చెలరేగిపోతుంటే కూడా బాధిత రాజకీయ నాయకులు అదే చేస్తుంటారు. ఎన్నికలు రాగానే యాక్టివ్ అయ్యి వారిని ఓడిస్తారు. ఇప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వం వరుస కేసులతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వేళ మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి కూడా మౌనం దాల్చడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేసింది.
జేసీ దివాకర్ రెడ్డి.. ఏ పార్టీలో ఉన్నా.. సొంత పార్టీ నేతలపై.. ప్రత్యర్థులపై కుండబద్దలు కొట్టినట్టు వాస్తవాలను మాట్లాడే వ్యక్తిగా పేరు సంపాదించుకున్నారు. ఇన్నాళ్లు జేసీ నోటి నుంచి ఎన్నో ఆణిముత్యాలు జాలువారాయి.. మీడియాలో హైలెట్ అయ్యాయి. అన్ని రోజులు అలానే సాగాయి. పార్టీలను వారి అవసరాలకు అనుగుణంగా జేసీ మాటలు మార్చేస్తుంటారు. కాని ఈ ఎన్నికల ఫలితాలు జేసీ పూర్తి దృష్టాంతాన్ని మార్చేశాయి.
అనంతపురం లోక్‌సభ, తాడిపత్రి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు జెసి కుటుంబం ఇమేజ్‌కి పెద్ద దెబ్బ తగిలింది. వైయస్ జగన్ మోహన్ రెడ్డిపై అర్థరహితంగా.. పగతో బండ బూతులు మాట్లాడిన జేసీ సోదరులు ఇద్దరూ ఇప్పుడు ఆ జిల్లాలో బలహీనపడ్డారు. అయితే.. జెసి దివాకర్ రెడ్డి ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు మొదట్లో ఎటువంటి మార్పు లేదని చెప్పాలి. సంవత్సరం వరకూ కూడా ఆయన అదే ధీమాగా ఉన్నారు. తన స్టైల్ తనదేనని తొడగొడుతూ అదే ధైర్యంతో ప్రవర్తించాడు. తన పద్ధతిలో మాట్లాడాడు. వైయస్ జగన్ మోహన్ రెడ్డిపై అవాంఛిత వ్యంగ్య మాటలు మాట్లాడుతూనే ఉన్నాడు.
ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత జేసీ కుటుంబానికి ఆర్థికంగా పెద్ద దెబ్బ తగిలిందని తాడిపత్రి ప్రజలు అంటున్నారు. వారికి సులభంగా వస్తున్న సంపాదన ఆగిపోయిందని అంటున్నారు. కరోనా కారణంగా బస్సులన్నింటిని విక్రయించి సురక్షితంగా మారామని.. ట్రావెల్స్ కేసుతో తాము ఏమీ కోల్పోలేదని జెసి ప్రభాకర్ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. కాబట్టి, జేసీ సోదరులు ఇద్దరూ నేరానికి పాల్పడినట్లు రుజువు అయినప్పటికీ వారు కొంత జరిమానా చెల్లించాల్సి ఉంటుందని భావించారు. కానీ ఇదంతా అరెస్టులకు ముందు మాట..
జేసీ ట్రావెల్స్ బస్సుల అక్రమాల్లో తన కుమారుడు అస్మిత్ అరెస్ట్ తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి కాస్త మారిపోయారు. లోకేశ్ కూడా అతనిని ఓదార్చడానికి వెళ్ళాడు. ఈ సీమ పౌరుష బిడ్డలకు ఇంతవరకు ఓదార్పు అంటే ఏమిటో వారికి తెలియదు.. ఈ సానుభూతి పిక్స్ వైరల్ కూడా అయ్యాయి.
జెసి దివాకర్ రెడ్డి కూడా ఆ సమయంలో దూకుడుగా మాట్లాడలేదు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి విషయంలో ఆయన మౌనం దాల్చారు. ఇదివరకే తన తమ్ముడు మాట్లాడిన మాటలకు హర్ట్ అయిన వైఎస్ జగన్ ప్రతీకార జ్వాలల్లో ఇప్పుడు జేసీ ఫ్యామిలీ తగలబడుతోందేనే గుసగుసలు జిల్లాలో వినిపిస్తున్నాయి.. అందుకే జేసీ వ్యూహాత్మక మౌనం దాలుస్తున్నారని జిల్లాలో ప్రచారం సాగుతోంది.
జగన్ ప్రభుత్వం పట్టుదలగా ఉండడంతోనే జేసీ ప్రభాకర్ రెడ్డికి ఇప్పుడు బెయిల్ లభించడం లేదు. నీరసమైన ముఖంతో మౌనంగా విచారణలకు జేసీ ప్రభాకర్ రెడ్డి , ఆయన కుమారుడు హాజరవుతున్నాడు. ఇటు అన్న జేసీ దివాకర్ రెడ్డి కూడా మౌనం దాల్చారు. సోదరులు ఇద్దరూ ప్రశాంతంగా మారారు.. ముఖ్యమంత్రిపై తప్పుడు ఆరోపణలు.. వ్యంగ్యాలతో మాట్లాడడానికి దైర్యం చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది.