ఉత్తినే ఏది జరగదు. రాజకీయంగా తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక కనిపించేది ఒకటైతే.. కనిపించని లెక్కలు తెర వెనుక ఉంటాయి. ఇప్పుడు అలాంటి లెక్కలే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. తన పరివారంతో కలిసి ప్రగతిభవన్ నుంచి బయటకు వచ్చి.. తాను ఎత్తేయాలనుకున్న ధర్నా చౌక్ లో కేంద్రం తీరుకు నిరసనగా ధర్నా చేశారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఏడున్నరేళ్లుగా ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న కేసీఆర్.. ప్రజా సమస్యల మీద పోరాడే వారి విషయంలో ఆయన తీరు ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.
కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గళం విప్పుతామని ప్రకటించి.. ఆ తర్వాత పత్తా లేకుండా పోయిన ఆయన తీరు ఇప్పటికి గుర్తే. అలాంటి ఆయన యాసంగిలో తెలంగాణ రైతుల ధాన్యాన్ని కేంద్రం కొంటుందా? లేదా? సూటిగా అడుగుతున్న తన ప్రశ్న ఢిల్లీలోని ప్రధాన కార్యాలయానికి పావుగంటలో చేరేందుకు వీలుగా తాను ధర్నా చేస్తున్న వైనాన్ని చెప్పుకోవటం తెలిసిందే. తాను ధర్నా చేసిన చోట.. నిఘా వర్గాలు ఉంటాయని.. తాను మాట్లాడే ప్రతి మాటా.. పావు గంట వ్యవధిలో నిఘా వర్గాల ద్వారా ప్రధాని టేబుల్ మీదకు చేరుతుందని చెప్పిన సీఎం కేసీఆర్ మాటల్లో నిజం లేకపోలేదు.
ధర్నా చౌక్ లో ధర్నాచేసేందుకు జరిగిన అసలు కసరత్తు ఏమిటి? అన్న విషయానికి సంబంధించి టీఆర్ఎస్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మోడీ సర్కారు తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాల్ని రద్దు చేయాలన్న కసరత్తు కేంద్రం చేస్తుందన్న కీలక సమాచారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి అందిందా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది. తనకు అందిన సమాచారాన్ని అందిపుచ్చుకునేందుకు వీలుగా యుద్ధ ప్రాతిపదికన ధర్నా చౌక్ లో ధర్నా నిర్ణయాన్ని వెలువరించారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
సీఎం కేసీఆర్ ఊరికే ఏమీ చేయరని.. అలాంటిది ఆయన తనకు తానుగా ధర్నా చౌక్ లో ధర్నా చేయాలన్న ఆలోచన వెనుక అసలు కారణం.. కేంద్రం తాను తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాల్నిరద్దు చేసేందుకు వీలుగా కసరత్తు చేస్తుందన్న సమాచారం కేసీఆర్ కు అందిందని.. దాన్ని అందిపుచ్చుకునేందుకు వీలుగా ధర్నా చౌక్ ఎపిసోడ్ ను చేపట్టారంటున్నారు.
ఇందులో నిజం ఎంత? అన్నది ప్రశ్నే అయినా.. జాతీయ స్థాయిలో కేసీఆర్ కున్న నెట్ వర్కు.. తాను టార్గెట్ చేసిన వారి విషయంలో అనుసరించే పంథా.. అందుకు తగ్గ ప్లానింగ్ ఎంత పక్కాగా ఉంటుందన్న విషయాన్ని తెలిసిన వారు ఎవరైనా సరే.. ఈ వాదనను సమర్థిస్తారని చెబుతున్నారు. ధర్నా చౌక్ లో ధర్నా ఎపిసోడ్ వెనుక అసలు కథ ఇప్పటికిప్పుడు కాకున్నా.. భవిష్యత్తులో బయటకు రావటం ఖాయమంటున్నారు.