కేసీఆర్.. అసదుద్దీన్.. పాలు నీళ్లలో కలిసిపోయే నేతలు..ఇద్దరి టార్గెట్ ఒక్కటే మోడీని గద్దెదించడం.. బీజేపీని ఓడించడం.. పక్కా మతతత్వ పార్టీ గా ముద్రపడి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఇప్పటికే దేశంలోని ముస్లిం ప్రభావిత ప్రాంతాల్లో తన పార్టీని విస్తరించాడు. హైదరాబాద్ కే పరిమితమైన అసద్ ఈ దేశవ్యాప్త విస్తరించడం వెనుక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హస్తముందని.. ఆయనే ఫండింగ్ చేస్తున్నాడని ఒక రూమర్ రాజకీయాల్లో ఉంది. బీజేపీ ఇదే ఆరోపిస్తుంటుంది. ఇక అసద్ నేరుగా ప్రగతి భవన్ లోకి వెళ్లి చాలా సందర్భాల్లో కేసీఆర్ తో అంతరంగిక చర్చలు సాగించారు. కానీ ఖమ్మంలో కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన బీఆర్ఎస్ సభలో మాత్రం అసద్ కనిపించడం లేదు.
తెలంగాణలో అధికార పార్టీ సభ లక్షల మందితో నిర్వహించారు. బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని దేశంలోని ముగ్గురు సీఎంలు, ఇతర ప్రతిపక్ష నేతలను ఖమ్మం సభకు రప్పించారు. కానీ కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడైన ఎంఐఎం అధినేత అసద్ మాత్రం కనిపించలేదు. బీఆర్ఎస్ కు జాతీయస్థాయి అటెన్షన్ తీసుకొచ్చిన కేసీఆర్ తన మిత్రుడైన అసద్ ను మా్తరం పిలవకపోవడం హాట్ టాపిక్ గా మారింది.
బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం తొలి సమావేశం ఖమ్మంలో జరిగింది.. ఈ సభకు ఐదు లక్షల మందిని తరలించింది. ఇది జాతీయ స్థాయిలో కేసీఆర్ బల నిరూపణ చేసుకుంది.ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కేరళ సీఎం పినరయి విజయన్‌తో పాటు సీపీఐ పార్టీ ప్రధాన కార్యదర్శి డి రాజా, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్‌లను ఆహ్వానించారు. పొరుగునే ఉన్న ఎంఐఎం అసద్ ను, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కేసీఆర్ ఆహ్వానం లేకపోవడం గమనార్హం.
అయితే అసద్ తో కలిస్తే మతతత్వ ముద్రను తన పార్టీపై వేస్తారని కేసీఆర్ కు తెలుసు. కేసీఆర్, అసద్ కలిస్తే బీజేపీ రెచ్చిపోతుంది. దీనిపై మత పార్టీ ముద్ర వేసి ఒక వర్గం ఓట్లను దూరం చేస్తుంది. ఈ ప్లాన్ తెలుసు కనకనే కేసీఆర్ తన మిత్రుడిని ప్రస్తుతానికి పక్కనపెట్టినట్టు తెలుస్తోంది.
దేశంలో హంగ్ వస్తే మొదట ఎంఐఎం మద్దతునే కేసీఆర్ కు దక్కుతుందని తెలుసు. ఇప్పటికే హైదరాబాద్ లోని జీహెచ్ఎంసీలో ఇలానే రహస్య అవగాహన చేసుకొని బీజేపీని పీఠం ఎక్కకుండా బీఆర్ఎస్, ఎంఐఎం కలిసి ప్లాన్ చేశాయి. ప్రస్తుతానికి ఎంఐఎంతో విభేదాలు.. దూరం పాటిస్తున్నా.. ఎన్నికలు ముగిశాక అవసరార్థం వీరిద్దరూ కలిసి సాగడం ఖాయంగా కనిపిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.