కుర‌సాల క‌నిపించ‌రేమీ... ప‌ద‌వి వుంటే త‌ప్ప‌.. ప‌ల‌క‌రా?

Update: 2022-08-25 04:32 GMT
కుర‌సాల క‌న్న‌బాబు. కాకినాడ రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే. కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కు డు. వైసీపీలో చేరిన ఆయ‌న .. గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్నారు. జ‌గ‌న్ తొలి కేబినెట్‌లో మంత్రిగా కూడా ప‌గ్గాలు చేప‌ట్టారు.

అంతేకాదు.. స‌ర్కారు త‌ర‌ఫున బ‌ల‌మైన వాయిస్ కూడా వినిపించారు.  స‌ర్కారుపై ఎవ‌రు ఏదైనా విమ‌ర్శ చేసినా.. వెంట‌నే ఖండించేవారు. ముఖ్యంగా జ‌న‌సేన నుంచి వ‌చ్చే విమ‌ర్శ‌ల‌కు సూటిగా.. సుత్తిలేకుండా అన్న‌ట్టుగా కౌంట‌ర్లు రువ్వేవారు.

అయితే.. రెండో ద‌ఫా జ‌గ‌న్ కేబినెట్ విస్త‌ర‌ణ‌లో కుర‌సాల‌కు ప‌ద‌వి పోయింది. అంతే.. ఇక అప్ప‌టి నుంచి ఆయ‌న ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. క‌నీసం.. మొక్కుబ‌డిగా కూడా ఎక్క‌డా పెద‌వి విప్ప‌డం లేదు. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. ప‌ద‌వి ఉంటే త‌ప్ప‌.. ఆయ‌న నోరు విప్ప‌రా..? అనే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. మ‌రోవైపు.. ఆయ‌న చూపు వేరేలా ఉంద‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి .. ఆయ‌న అప్ప‌టి ప‌రిస్థితిని బ‌ట్టి.. పార్టీ మారే ఆలోచ‌న‌లో ఉన్నార‌ని కొంద‌రు అంటున్నారు.

వాస్త‌వానికి కుర‌సాల‌ను ఓడించి తీరాల‌నేది.. స్థానికంగా ఉన్న‌రెడ్డి సామాజిక వ‌ర్గం బ‌లంగా ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ముఖ్యంగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డికి క‌న్న‌బాబుకు ఎక్క‌డా పొంత న‌లేకుండా పోయింది.

ఆయ‌న మంత్రిగా ఉన్న స‌మ‌యంలో కూడా వివాదాలు సాగాయి. ఇప్పుడు కూడా నివురు గ‌ప్పిన నిప్పు మాదిరిగా ప‌రిస్థితి ఉంది. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను వైసీపీ త‌ర‌ఫున పోటీ చేసినా.. రెడ్డి వ‌ర్గం త‌న‌కు వ్య‌తిరేకంగా చక్రం తిప్పే అవ‌కాశం ఉంద‌ని భావిస్తున్నారు.

అదేస‌మ‌యంలో కాపు వ‌ర్గం.. మొత్తంగా జ‌న‌సేన‌వైపు మొగ్గు చూపితే.. త‌న‌కు డిపాజిట్లు ద‌క్క‌డం కూడా క‌ష్ట‌మ‌నే భావన‌లో ఉన్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ ప‌రిణామాల క్ర‌మంలోనే కుర‌సాల‌.. పార్టీ మార్పువైపు దృష్టి పెట్టార‌ని.. కుదిరితే.. దాదాపు జ‌న‌సేన తీర్థం పుచ్చుకునే అవ‌కాశం ఉంద‌ని.. అయితే.. ఇది అప్ప‌టి రాజ‌కీయ ప‌రిణామాల‌ను బ‌ట్టి ఆధార‌ప‌డి ఉంటుంద‌ని చెబుతున్నారు. మ‌రి కుర‌సాల గ‌మ్యం ఎటు ఉంటుందో చూడాలి.
Tags:    

Similar News